Janhvi Kapoor: స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ అలాంటి రిస్క్ కు సిద్ధమవుతారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కు సినిమా సినిమాకు క్రేజ్ పెరుగుతుండగా ప్రతి సినిమా స్పెషల్ గా ఉండేలా రామ్ చరణ్ ప్లాన్ చేసుకుంటున్నారు. దీపావళి పండుగ కానుకగా ఈ సినిమా నుంచి జరగండి జరగండి సాంగ్ రిలీజ్ కానుండగా థమన్ మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉండనుందో చూడాల్సి ఉంది. గుంటూరు కారం, గేమ్ ఛేంజర్ సినిమాల సాంగ్స్ కొన్ని రోజుల గ్యాప్ లోనే రిలీజ్ కానున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాలో జాన్వీ కపూర్ స్పెషల్ సాంగ్ చేయనుందని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

దేవర సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకుంటుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ అలాంటి రిస్క్ కు సిద్ధమవుతారా? అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. జాన్వీ కపూర్ నుంచి స్పష్టత వస్తే మాత్రమే ఈ వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. గేమ్ ఛేంజర్ బడ్జెట్ విషయంలో దిల్ రాజు ఏ మాత్రం రాజీ పడటం లేదు.

చరణ్ కు ఉన్న క్రేజ్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో, శంకర్ కు ఉన్న క్రేజ్ వల్ల తమిళనాడులో ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధించే ఛాన్స్ అయితే ఉంది. గేమ్ ఛేంజర్ సినిమా హక్కులకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. జాన్వీ కపూర్ కు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుండగా జాన్వీ కపూర్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

జాన్వీ కపూర్ (Janhvi Kapoor) స్టార్ హీరోలతో నటించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. జాన్వీ కపూర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. జాన్వీ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుని సత్తా చాటుతారేమో చూడాల్సి ఉంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus