Janhvi Kapoor, Suriya: క్రేజీ కాంబో సినిమాలో జాన్వీ ఫిక్సా? అలా తమిళ ఇండస్ట్రీ కూడా కవర్‌?

పాన్‌ ఇండియా ఫీవర్‌ పుణ్యమా అని డిఫరెంట్‌ కాంబినేషన్‌లు సెట్‌ అవుతున్నాయి. బాలీవుడ్‌ హీరోయిన్‌, సౌత్‌ హీరో అనేది మనకు కొత్త కాదు. అయితే ఇప్పుడు సౌత్‌ దర్శకుడు, బాలీవుడ్‌ హీరోలు చూస్తున్నాం. అలాగే సౌత్‌ హీరో, బాలీవుడ్‌ దర్శకుడు అనే కాంబో కల కూడా సాకారమవుతోంది. హిందీలో స్టార్‌ దర్శకుడు… ఓ తమిళ స్టార్‌తో సినిమా చేయబోతున్నాడు. ఆ క్రేజీ కాంబినేషన్‌లో జాన్వీ కపూర్‌ కూడా యాడ్‌ అవుతోంది అనేది లేటెస్ట్‌ టాక్‌.

బాలీవుడ్‌లో ఇప్పటికే తనకంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌ ఏర్పరచుకున్న కథానాయిక జాన్వీ కపూర్‌. శ్రీదేవి కూతురు అనే ఫీల్‌ నుండి ఎప్పుడ తనను తాను బయటకు తీసుకొచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలో సౌత్‌లో ‘దేవర’ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఇప్పుడు తమిళ హీరోతో కూడా నటించి సౌత్‌లో రెండో సినిమా అనే కౌంట్‌ ఇచ్చేస్తోంది అంటున్నారు. అయితే ఆ సినిమాకు బాలీవుడ్‌ దర్శకుడు మెగాఫోన్‌ పట్టబోతున్నారు.

రాకేష్‌ ఓం ప్రకాష్‌ మెహ్రా దర్శకత్వంలో తమిళ కథానాయకుడు సూర్య ‘కర్ణ’ అనే సినిమాలో నటిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ ఎంతవరకు మెటీరియలైజ్‌ అవుతుందో తెలియదు కానీ… ఆ సినిమాలో సూర్య సరసన నటించడానికి జాన్వీని ఎంపిక చేసినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. మహాభారతంలోని కర్ణుడి పాత్ర ఆధారంగా, రెండు భాగాలుగా ‘కర్ణ’ సినిమా రూపొందనుందని ఇప్పటికే చెప్పారు కూడా. త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ ఇస్తారట.

భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. అవి ఓ కొలిక్కి వస్తే సినిమా కాస్ట్‌ అండ్‌ క్రూ విషయంలో ఇంకాస్త క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు. అన్నట్లు సూర్య ప్రస్తుతం తమిళంలో చేస్తున్న ‘కంగువ’లో బాలీవుడ్‌ నటులు పెద్ద ఎత్తున నటిస్తున్నారు. అది పాన్‌ ఇండియా ప్రాజెక్టే. ఆ తర్వాత చేయబోయే సినిమా కూడా అంతే. సో సూర్య (Suriya) నెక్స్ట్‌ స్టెప్స్‌ చాలా ఇంట్రెస్టింగ్‌.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus