Devara: దేవరలో జాన్వి కపూర్ క్యారెక్టర్ తెలిస్తే మైండ్‌ బ్లాక్‌ అయిపోతుందట!

ఆర్ఆర్‌ఆర్‌ సినిమాతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ స్టార్‌ హీరో ఎన్టీఆర్. వరుసగా ఆరు హిట్‌లతో ఫుల్ ఫామ్‌తో కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు ఈ యంగ్ టైగర్. ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివతో భారీ పాన్ ఇండియా సినిమా “దేవర” చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో చిత్ర బృందం ఈ సినిమానుపర్ఫెక్ట్ ప్లానింగ్‌తో షూటింగ్‌ను శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా (Devara) షూట్‌పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఓ భారీ షెడ్యూల్ ఇప్పుడు స్టార్ట్ అయ్యిందట. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ‘దేవర’ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చి నెలలోనే మొదలు పెట్టారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన రెండు భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. ప్రస్తుతం మూడో షెడ్యూల్‌ను కూడా ప్లాన్ చేసుకున్నారు.

ఈ వారంలోనే ప్రారంభం కాబోతున్న కొత్త షెడ్యూల్‌లో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కూడా భాగం కాబోతున్నారు. ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలిసింది. ఇక ‘దేవర’ సినిమాలో బాలీవుడ్‌ తార జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఆమె మత్స్యకార కుటుంబానికి చెందిన యువతిగా కనిపించబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఇందులో ఆమె ఓ అండర్ కవర్ ఆఫీసర్‌గా నటిస్తుందని తెలిసింది.

కోస్టల్ ఏరియాలో ఓ డాన్‌ అయిన ఎన్టీఆర్‌పై నిఘా పెట్టేందుకు అధికారులు ఆమెను అక్కడకు పంపిస్తారట. అందుకే ఆమె జాలరి యువతిగా కనిపిస్తుందట. కానీ, ఆమె రియల్ క్యారెక్టర్ రివీల్ అయ్యే ట్విస్ట్ ప్రి ఇంటర్వెల్‌‌లో వస్తుందని తెలిసింది. ఈ సీన్‌కు అందరికీ మైండ్ బ్లాక్ అవుతుందని టాక్. 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus