Jani Master Wife: ఆ తప్పుల వల్ల జానీ మాస్టర్ భార్యకు సైతం ఇబ్బందులు తప్పవా?

టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన జానీ మాస్టర్ (Jani Master)  కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే ఊహించని వివాదంలో చిక్కుకోవడంతో ఆయన కెరీర్ ప్రస్తుతం ప్రమాదంలో పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలీసులు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేయగా ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషాపై కూడా కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు జానీ మాస్టర్ భార్య వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆ ఇంటర్వ్యూలలో షాకింగ్ విషయాలు వెల్లడించడంతో పాటు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

Jani Master Wife

బాధితురాలిపై సంచలన ఆరోపణలు చేయడం ద్వారా ఆమె కొత్త సమస్యల్లో చిక్కుకుంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జానీ భార్య కూడా బాధితురాలిపై దాడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారనే సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ సైతం తాను తప్పు చేసినట్టు అంగీకరించాడని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సుమలత అలియాస్ అయేషా ఇంటర్వ్యూలకు వీలైనంత దూరంగా ఉంటే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయేషాను పోలీసులు అరెస్ట్ చేస్తే మాత్రం ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. జానీ మాస్టర్ కు బెయిల్ రావాలంటే మరో మూడు నెలల సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది. జానీ మాస్టర్ కు రాబోయే రోజుల్లో కొరియోగ్రాఫర్ గా ఆఫర్లు రావడం కూడా కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

జానీ మాస్టర్ ఈ కేసు నుంచి బయటపడటం సులువు కాదని పోక్సో చట్టం కింద కేసు నమోదైన నేపథ్యంలో బెయిల్ కు సంబంధించి ప్రత్యేక నిబంధనలు ఉంటాయని తెలుస్తోంది. జానీ మాస్టర్ పై నమోదైన కేసు వల్ల ఇతర కొరియోగ్రాఫర్లు సైతం టెన్షన్ పడుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. జానీ మాస్టర్ కేసు విషయంలో ఇప్పటికే కస్టడీ పిటీషన్ దాఖలైన నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

తిరుమల లడ్డూ కల్తీపై నాగబాబు షాకింగ్ కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus