Nagarjuna: జపాన్‌లో నాగ్‌కి ఆ పేరు జోడిస్తూ సోషల్ మీడియా పోస్టులు.. ఏంటి స్పెషల్‌

అక్కినేని నాగార్జునను తెలుగు ప్రేక్షకులు నాగ్‌ అని, మన్మథుడు అని, కింగ్‌ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాల ప్రభావం వల్ల పాన్‌ ఇండియా ప్రేక్షకులూ అలానే అంటున్నారు. అయితే ఓ దేశంలో మాత్రం నాగార్జునను నాగ్‌ సమా అని పిలుస్తున్నారు. దీని వెనుక పెద్ద కథే ఉంది. ‘కుబేర’ సినిమా విడుదల సందర్భంగా ఈ విషయం బయటకు వచ్చింది. మరి నాగ్‌ సమా సంగతేంటో చూద్దామా?

Nagarjuna

‘కుబేర’ సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలైన తర్వాత ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. అలా జపాన్‌ వాసులు సినిమాను చూసి తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో వెలిబుచ్చుతున్నారు. సినిమా గురించి, అందులో దీపక్‌ పాత్రలో నాగార్జున నటన గురించి, నాగ్‌ గురించి ప్రత్యేకంగా రాసుకొస్తున్నారు. ఈ క్రమంలో ‘నాగ్‌ సమా’ అని పిలుస్తుండటం గమనార్హం. దీంతో అసలు ఈ ‘సమా’ ఏంటి అని ఆరా తీస్తే ఆసక్తికర విషయం ఒకటి బయటికొచ్చింది.

మన గౌరవం, మర్యాద ఇచ్చేటప్పుడు ‘గారు’ అని అంటుంటాం కదా అలా జపనీయులు ‘సమా’ అని అంటారట. జపాన్లో దేవుళ్లు, రాజులను, గొప్పవాళ్ల గురించి మాట్లాడేటప్పుడు ఆఖరులో సమా అనే పదం జోడిస్తారు. ఆ గౌరవం ఇప్పుడు నాగార్జునకు దక్కింది. దీనికి సంబంధించి జపనీయుల సోషల్‌ మీడియా పోస్టులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

ఇదంతా ఎక్కడ మొదలైందా అని చూస్తే.. రణబీర్ కపూర్ ‘బ్రహ్మాస్త’ సినిమాలో అక్కినేని నాగార్జున ఓ ప్రధాన పాత్ర పోషించారు. ఆ సినిమా జపాన్ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంది. అప్పటి నుండి నాగార్జునకు అక్కడ ఫ్యాన్‌ బేస్‌ పెరిగింది. అలా ‘సమా’ అనే గౌరవం కూడా యాడ్‌ అయింది. ఇప్పుడు ‘కుబేర’ సినిమాలో నటన చూసిన తర్వాత ఆ ప్రేమ, అభిమానం, సమా ఇంకా పెరిగాయన్నమాట. రజనీకాంత్‌ ‘కూలీ సినిమాలోనూ నాగార్జున నటిస్తుండటంతో ఆ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా నాగ్‌ సమా అనే రాస్తున్నారు జపనీయులు.

మూడు ముక్కల ‘పవర్‌ పేట’.. ఇప్పుడు మరో హీరో – నిర్మాత చేతుల్లోకి..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus