థియేటర్స్ సర్దుబాటుకానప్పటికీ కృష్ణాష్టమి, స్వాతంత్ర దినోత్సవం సెలవలు కలిసి రావడంతో ఆగష్టు 11న మూడు భారీ చిత్రాలు విడుదలయ్యాయి. నేనే రాజు నేనే మంత్రి, లై, జయ జానకి నాయక సినిమాలు పోటీ పడ్డాయి. వీటిలో నేనే రాజు నేనే మంత్రికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి వారంలో భారీగా కలక్షన్స్ రాబట్టి ముందు స్థానంలో నిలిచింది. అయితే బెల్లం కొండ శ్రీనివాస్ చిత్రం జయ జానకి నాయక రెండో వారం నుంచి పుంజుకుంది. థియేటర్స్ పెరగడంతో రానా సినిమాతో పోటీ పడుతోంది. 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నేనే రాజు నేనే మంత్రి దాదాపు 17 కోట్ల షేర్ వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల షేర్ తో రానాపై క్రేజ్ ని చాటింది. జయ జానకి నాయక తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల్లో 17 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ లో కలక్షన్స్ కలుపుకుంటే 18.5 కోట్లకు చేరింది. ఈ వారాంతానికి నేనే రాజు నేనే మంత్రి వసూళ్ల కంటే జయ జానకి నాయక ఎక్కువ రాబడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ సినిమాపై మాస్ లో ఉన్న క్రేజ్ చూస్తుంటే బోయపాటి సినిమా పోటీలో తొలిస్థానం కైవశం చేసుకునేలా ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.