బుల్లితెర పై నెంబర్ 1 యాంకర్ గా రాణిస్తూనే మరోపక్క ప్రతీ సినిమా వేడుకలకి హోస్ట్ గా వ్యవహరిస్తూ వచ్చిన సుమ కనకాల తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’.గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది. దర్శకుడు మంచి పాయింట్ ను అలాగే ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని నేటివిటీతో ‘జయమ్మ పంచాయితీ’ ని తెరకెక్కించినప్పటికీ కథనం వీక్ గా ఉండడంతో సినిమా ఫలితం పై ఎఫెక్ట్ పడింది. అయినప్పటికీ మొదటి రోజు ఒకింత పర్వాలేదు అనిపించిన ఈ మూవీ తర్వాత ఆ ఊపుని కొనసాగించలేకపోయింది.
ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.27 cr |
సీడెడ్ | 0.11 cr |
ఉత్తరాంధ్ర | 0.13 cr |
ఈస్ట్ | 0.06 cr |
వెస్ట్ | 0.04 cr |
గుంటూరు | 0.07 cr |
కృష్ణా | 0.07 cr |
నెల్లూరు | 0.04 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 0.79 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్ | 0.04 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 0.83 cr |
‘జయమ్మ పంచాయితీ’ చిత్రానికి రూ.3.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.0.83 కోట్ల షేర్ ను రాబట్టింది. మొదటి రోజు కొంతవరకు పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం ఆ తర్వాత బాగా డల్ అయిపోయింది. పోటీగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ‘భళా తందనాన’ వంటి సినిమాలు ఉండడం ఈ మూవీ పై ఎఫెక్ట్ పడింది. అయితే ‘భళా తందనాన’ తో పోలిస్తే ఈ మూవీ పర్వాలేదనిపించింది అనే చెప్పాలి.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!