సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్న సీనియర్ హీరోయిన్
- February 20, 2018 / 11:46 AM ISTByFilmy Focus
‘దశావతారం’ సినిమాలో కమల్‌హాసన్ తో కలిసి నటించి.. ఆ తర్వాత తెలుగు తెరకు దూరమైంది అలనాటి అందాల హీరోయిన్ జయప్రద. రాజకీయాలతో బిజీబీజీగా ఉన్న జయప్రద ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో గ్రాండ్‌గా సిల్వర్ స్క్రీన్‌పై రీఎంట్రీకి రెడీ అయింది. ప్రస్తుతం ఈమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో నటించిన “శరభ, సువర్ణ సుందరి” సినిమాలు ఈ వేసవిలో విడుదల కానున్నాయి. వీటితోపాటు తమిళం, మలయాళంలో నటించిన రెండు మూవీస్ ఫిబ్రవరి 23న విడుదలవుతున్నాయి. హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కొత్త డైరెక్టర్లతో కలిసి సినిమాలు కూడా చేస్తోంది జయప్రద.
అలాగే.. తనకున్న కాంటాక్ట్స్ ను వినియోగించి స్టార్ హీరోల సినిమాల్లోనూ కీలకపాత్రలు పోషించేందుకు మరియు స్టార్ హీరోల తనయులు నటించే సినిమాల్లో తల్లి పాత్రలకు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే.. సెకండ్ ఇన్నింగ్స్ ను జయప్రద కాస్త గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. త్వరలోనే సొంతంగా సినిమాలు కూడా నిర్మించేందుకు జయప్రద సంసిద్ధమవుతున్నట్లు సమాచారం.















