అందం, అభినయంతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది జయప్రద. ఆమె చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసింది. ప్రముఖ దర్శకుడు అయిన కె.బాలచందర్ ఆమె నటనను ఎంతో మెచ్చుకునేవారు. ఈమె సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియా లో కూడా పెద్ద హీరోలైన అమితాబచ్చన్, జితేంద్ర, ధర్మేంద్ర వంటి వారితో నటించి సంచలనం సృష్టించింది.బాలీవుడ్ సినీ జనాలతో పాటు నార్త్ ఇండియన్ ప్రేక్షకులు ఆమె అందచందాలకు ఫిదా అయిపోయారు. సాధారణంగా మనం డాక్టర్-యాక్టర్ అంటూ తరుచూ కొన్ని సందర్బాల్లో వాడుతూ ఉంటాం.
అయితే కొంత మంది జీవితాలల్లో కొన్ని అనుకొని సంఘటనలు జరుగుతుంటాయి. అలా స్టార్ హీరోయిన్ జయప్రద జీవితంలో కూడా జరిగింది. డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే.. డాక్టర్ చదువుతూ.. మధ్యలోనే వదిలేసి మరీ.. సినీ ఫీల్ఢ్ లొకి వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అయితే.. డాక్టర్ కావాలని అనుకుని.. యాక్టర్ గా ఎలా సినీరంగంలోకి వచ్చిందనేది మాత్రం ఇంట్రస్టింగ్.
ఇదే విషయంపై జయప్రద ఓ సందర్భంలో మాట్లాడుతూ.. “డాక్టర్ కావాలనుకున్నా. కానీ ఆర్టిస్ట్ అయ్యా. అనర్గళంగా సినిమాలో ఏ డైలాగ్ అయినా చెప్పాలి. ఎలాంటి వారితోనైనా అనర్గళంగా మాట్లాడాలి. నాకు అవన్నీ కుదిరేవి కావు. ప్రతిదీ నాకు విరుద్ధంగా ఉండే అట్మాస్ఫియర్. భగవంతుడు నా పట్ల చాలా దయతో వ్యవహరించేవాడు. నా లెర్నింగ్ ప్రాసెస్ చాలా ఇంటెన్సివ్‌గా ఉండేది.
ఇక, రాజకీయాల్లోనూ ప్రవేశించిన తొలి తెలుగు హీరోయిన్ (Jayaprada) జయప్రదే కావడం గమనార్హం. ఆమె యూపీలోని రాంపూర్ నుంచి రెండుసార్లు ఎస్పీ తరపున ఎంపీగా కూడా ఆమె విజయం దక్కించుకున్నారు. తనది కాని యూపీ రాష్ట్రంలో రాజకీయాలు చేయడం మరో విశేషం. నిజానికి ఆమె కోరుకున్నట్టు డాక్టర్ అయి ఉంటే.. కేవలం కొందరికే పరిమితమై ఉండేది. కానీ, యాక్టర్ కావడంతో అనేక కోణాల్లో జయప్రద తన ప్రతిభను చాటుకుందని అనడంలో సందేహం లేదు.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!