Jayasudha: పవన్, మహేష్, చరణ్ గురించి జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సహజనటిగా జయసుధకు గుర్తింపు ఉండగా ప్రస్తుతం అమ్మ, అమ్మమ్మ తరహా పాత్రలలో ఆమె నటిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయసుధ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిరంజీవి గారితో నాలుగు సినిమాలలో కలిసి నటించానని ఆమె చెప్పుకొచ్చారు. చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చే సమయానికి నాకు గుర్తింపు ఉందని జయసుధ వెల్లడించారు. చిరంజీవి హనుమాన్ భక్తుడని జయసుధ కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా చేశానని ఆయన ఎక్కువగా మాట్లాడరని ఆమె చెప్పుకొచ్చారు.

రామ్ చరణ్ గురించి జయసుధ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీలో అందరూ వినయంగానే ఉంటారని అన్నారు. రామ్ చరణ్ తండ్రి నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నాడని పెద్దవాళ్లను గౌరవిస్తాడని, ఎక్కడ ఎలా మాట్లాడాలో చరణ్ కు తెలుసని ఆమె తెలిపారు. ఇప్పుడున్న హీరోలు అందరూ టాలెంటెడ్ అని జయసుధ వెల్లడించారు. మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహర్షి చేశానని కృష్ణగారిలా మహేష్ బాబు కూడా ఎవరితో మాట్లాడడని ఆమె పేర్కొన్నారు.

మహేష్ బాబు క్వైట్, కామ్ అని జయసుధ తెలిపారు. మహేష్ బాబు జయసుధ గారు అని పిలుస్తాడని రామ్ చరణ్ ఆంటీ అని పిలుస్తాడని ఆమె వెల్లడించారు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకూడదని భావిస్తానని ఆమె పేర్కొన్నారు. జయప్రద నాకు చాలా క్లోజ్ అని జయసుధ వెల్లడించడం గమనార్హం. రాధిక కూడా చాలా క్లోజ్ అని జయసుధ అన్నారు. శ్రీప్రియ కూడా ఫ్రెండ్ అని ఆమె వెల్లడించారు.

సాగరసంగమం షెడ్యూల్స్ క్యాన్సిల్ కావడం వల్ల ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని జయసుధ పేర్కొన్నారు. ఆ సినిమాను మిస్సైనా బాధ పడలేదని ఆమె అన్నారు. విశ్వనాథ్ గారు నాతో ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేశారని ఆమె వెల్లడించారు. జయసుధ (Jayasudha) చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus