జేడీ చక్రవర్తి ‘ హూ’ చిత్రం ట్రైలర్ విడుదల

జెడి చక్రవర్తి, శుభ రక్ష, నిత్య హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన చిత్రం ‘ ‘హూ’. ఇటీవలే ఈ చిత్రం డబ్బింగ్, ఎడిటింగ్, వంటి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది . కాగ నిన్న హైదరబాద్ ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. చిత్ర ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ట్రెజరర్ ప్రసన్న కుమార్, ఆర్టిస్ట్ నాగ మహేష్ లు సంయుక్తంగా ఆవిష్కరించగా , పోస్టర్ ను ప్రముఖ నిర్మాత ఆచంట గోపీనాథ్, నిర్మాత శోభారాణి , ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ కొల్లి రామ కృష్ణ సంయుక్తంగా ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు ఈశ్వర్,బలగం ఫేం సంజయ్, నిర్మాత విజయ్ డిస్ట్రిబ్యూటర్స్ మురళి కృష్ణ, రాందేవ్, శంకర్, పి ఆర్ ఓ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రెడ్డమ్మ కే బాలాజీ మాట్లాడుతూ జెడి చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపుదిద్దుకున్న ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ’ హూ’.ఈ చిత్రంలో జెడి చక్రవర్తి గారి నటన చాలా వైవిధ్యంగా ఉంటుంది ఆయన రీసెంట్ గా చేసిన ,”దయ” వెబ్ సిరీస్ ఓ సంచలనం. అంత పెద్ద హిట్ అయిన దయ సిరీస్ లాగానే మా సినీమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాము.అలాగే మాలాంటి చిన్న నిర్మాత లను ముందుండి నడిపిస్తున్న ప్రసన్న కుమార్ గారికి , కొల్లి రామకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus