Jeevitha: వాళ్లకోసం ఎవరితోనైనా ఫైట్ చేస్తాను!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రాజశేఖర్ ఇప్పటివరకు హీరోగా మాత్రమే సినిమాలలో నటించారు అయితే మొదటిసారి నెగిటివ్ పాత్రలో నటించబోతున్నారు. నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందు రాబోతున్నటువంటి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో ఈయన నెగటివ్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా జరిగినటువంటి ప్రీ రిలీజ్ వేడుకలో రాజశేఖర్ తో పాటు జీవిత కూడా హాజరై సందడి చేశారు ఇక ఈ సినిమాలో రాజశేఖర్ చెప్పినటువంటి ఒక డైలాగ్ బాగా ఫేమస్ అయింది. నాకు జీవితం అయినా జీవిత అయినా ఒకటేనని నేను జీవిత మాటే వింటానంటూ ఈయన చెప్పిన డైలాగ్ వైరల్ గా మారింది.

అయితే ఈ వ్యాఖ్యలపై జీవిత మాట్లాడుతూ భార్య భర్తల తర్వాత ఒకరి మాట ఒకరి వినాలి ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి అలాగే కష్టసుఖాలను కూడా పంచుకోవాలని జీవితం సంతోషంగా ఉంటుందని అలా ఉండేవారే పెళ్లిళ్లు కూడా చేసుకోవాలని తెలియజేశారు. మా జీవితంలో కూడా అదే జరిగిందని మేము ఎంతో సంతోషంగా ఉన్నామని తెలిపారు.

మా గురించి ఎవరేమనుకున్నా నేను పట్టించుకోనని తెలిపారు. నాకు మా ఆయన నా ఇద్దరు పిల్లలు సర్వస్వం వారికోసం నేను ఎవరితో ఫైట్ చేయడానికి అయినా ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధంగా ఉంటాను అంటూ ఈ సందర్భంగా జీవిత చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus