ఫస్ట్ సినిమా పోస్టర్ వదిలిన బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ జెస్సి!

బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారిలో జస్వంత్ జెస్సి కూడా టాప్ లిస్టులో ఉన్నాడని చెప్పవచ్చు. ఫ్యాషన్ ప్రపంచంలో మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న జెస్సి చాలా తొందరగానే హౌస్ లో సెట్టయ్యాడు. మొదట్లో అతని అతి చేష్టల వలన అందరూ కూడా చిన్నపిల్లాడు అంటూ నెగిటివ్ గా కామెంట్స్ చేశారు.

ముఖ్యంగా ఆనీ మాస్టర్ తో గొడవ పడినప్పుడు అతను హౌస్ లో నుంచి వెళ్లిపోవడం కాయమని అందరూ అనుకున్నారు. ఏదేమైనా కూడా బిగ్ బాస్ సీజన్ 5లో టాప్ 5 వరకు వెళ్లాలని జెస్సి గట్టిగానే పోరాడాడు. అయితే అనారోగ్య కారణాల వలన జెస్సి 10వ వారంలో బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత మెల్లగా అతను కెరీర్ ను సెట్ చేసుకునే ప్రయత్నాలు చేశాడు.

బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో సినిమా సెట్ అయినట్లు కూడా తెలియజేశారు. ఇక సోషల్ మీడియాలో అతను అఫీషియల్ గా సినిమా పోస్టర్ కూడా విడుదల చేశాడు. ఆ సినిమాకు ఎర్రర్ 500 అనే టైటిల్ సెట్ చేశారు. ఇక సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో జెస్సి రక్తపు మరకలతో తుపాకీ పట్టుకొని స్టిల్ ఇచ్చాడు. చూస్తుంటే జెస్సి మొదటి సినిమాతోనే యాక్షన్ లుక్ లో దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇక సినిమా పోస్టర్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన జెస్సి ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుంది అని అలాగే మీ సపోర్ట్ కూడా నాకు కావాలి అని పేర్కొన్నాడు. అంతేకాకుండా భవిష్యత్తులో మరింతగా ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేశాడు. ఇక పది వారాల వరకు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన జెస్సీ 15 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ఇక ఈ ప్రస్తుతం అతను ఇండస్ట్రీ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. మరి నటుడిగా అతను ఏ స్థాయికి వెళతాడో చూడాలి.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus