సూపర్ స్టార్ రజినీ కాంత్ పెద్ద కుమార్తె ఐశ్యర్య ఇంట్లో భారీ చోరీ జరిగింది.. దీని గురించి ఆమె చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.. పెద్ద మొత్తంలో వజ్రాలు, నగలు దొంగిలించారనే వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.. ఎట్టకేలకు ఇంట్లో పని చేసిన వాళ్లే ఇంటి దొంగలని నిర్దారణ కావడంతో వారిని అరెస్ట్ చేశారు.. అయితే రూ. 30 వేల జీతం సరిపోకే దొంగతనానికి పాల్పడినట్లు పనిమనిషి ఈశ్వరి చెప్పడం కొసమెరుపు..
వారు సుమారు 60 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, వ్రజాలు, వెండి వస్తువులు దొంగిలించారు.. ఈ విషయం ఇంకా వార్తల్లో ఉండగానే మరో సినీ ప్రముఖుడి ఇంట్లో భారీ చోరీ జరిగింది.. విలువైన బంగారు, వజ్రాభరణాలు దొంగిలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. లెజెండరీ సింగర్ జేసుదాస్ తనయుడు సింగర్ విజయ్ జేసుదాస్ ఇంట్లో శుక్రవారం (మార్చి 31) దొంగతనం జరిగింది..
జేసుదాస్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసి అద్బుతమైన గాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ జేసుదాస్.. అంతకుముందు ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ నుండి సంగీతంలో బీఏ చేశాడు.. సౌత్‌లో అన్ని ఇండస్ట్రీల్లోనూ పాటలు పాడాడు. .విజయ్‌ది ప్రేమ వివాహం.. భార్య పేరు దర్శన.. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.. చెన్నైలోని అభిరామపురంలోని విజయ్ జేసుదాస్ ఇంట్లో భారీగా బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు, పలు డాక్యుమెంట్స్ దొంగతనానికి గురయ్యాయి..
దీని గురించి పోలీసులు ఫిర్యాదు చేసిన విజయ్.. తన ఇంట్లో పని చేసేవారిపై అనుమానం వ్యక్తం చేశాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. కోలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లల్లో ఇలా వరుస దొంగతనాలు చోటు చేసుకోవడం.. అది కూడా పని వారే చేతి వాటం చూపడం ఇండస్ట్రీ వర్గాల వారిని కలవరపెడుతోంది.. దీంతో పని మనుషుల మీద కూడా తప్పనిసరిగా నిఘా పెట్టాల్సి వస్తుంది.. కొత్తగా పనిలో పెట్టుకోవాలంటే ఆలోచించాల్సి వస్తుంది..
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?