తెలుగు ప్రజలు మాత్రమే కాకుండా భారత దేశంలో అనేక మంది అభిమానించే నటి శ్రీదేవి. ఆమె మరణం అందరిలో విషాదాన్ని నింపింది. అనేక సందేహాలు, ప్రశ్నలు తర్వాత శ్రీదేవి పార్థివదేహాం దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చింది. అభిమానుల సందర్శనార్థం ముంబయిలోని సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్‌లో శ్రీదేవి భౌతికకాయాన్ని ఉంచారు. అక్కడి నుంచి అంతిమయాత్ర నిర్వహించి ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సమయంలో కొన్ని సంవత్సరాల క్రితం తన తల్లిని ఎంత ప్రేమిస్తున్నానో తెలుపుతూ జాహ్నవి రాసిన లేఖ బయటికి వచ్చింది. దానిని చదివిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటున్నారు.
ఫెమినా మేగజైన్ ఎడిటర్ తాన్యా చైతన్య బయటపెట్టిన ఆ లేఖలో జాహ్నవి ఏమి రాసిందంటే.. “ప్రియమైన అమ్మ.. మీ క్రమశిక్షణ, పని పట్ల నిబద్దత, మీ పేరు ప్రఖ్యాతలు గురించి వింటూ నేను పెరిగాను. నువ్వు సాధించిన విజయాలప్పుడు నేను లేనందుకు నాకు బాధగా ఉన్నా.. నీ కూతురిగా పుట్టింనందుకు గర్వపడుతున్నాను. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను అమ్మ” అంటూ తన ప్రేమని అక్షరాల రూపంలో చెప్పింది. ఈ లేఖ చదివిని ప్రతి ఒక్కరూ శ్రీదేవి మరణం కూతుళ్లను ఎంత కుంగదీస్తుందోనని బాధపడుతున్నారు. వారికి తల్లి మరణాన్ని తట్టుకొని నిలబడే శక్తిని ఇమ్మని దేవుడిని కోరుకుంటున్నారు.