ఆ కారణంగానే డ్యాన్స్ మాస్టర్ చైతన్య చనిపోయాడు!

ఢీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్స్‌ మాస్టర్‌ చైతన్య.. ఆదివారం సాయంత్రం నెల్లూరులోని ఓ హోటల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. డ్యాన్స్ లో ఎంతో ప్రతిభ కలిగిన చైతన్య.. ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం అందరిని షాక్‌కు గురి చేసింది. అప్పుల బాధ భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చైతన్య సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇక చైతన్య ఆత్మహత్య చేసుకోవడంపై కండక్టర్‌ ఝాన్సీ స్పందిస్తూ.. చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేసుతున్నాయి.

ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ..‘‘చైతన్య చనిపోయినట్లు మేం ఒంగోల్‌ ప్రొగ్రామ్‌కు వచ్చాక తెలిసింది. అందరితో ఒకసారి కూర్చుని.. మాట్లాడి ఉంటే.. ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కొందరు కంటెస్టెంట్స్‌కి ఆయన అమౌంట్‌ ఇవ్వాల్సి ఉంది. దాని గురించి ఆయన వారితో డైరెక్టు గా మాట్లాడి.. డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను.. అని చెప్పి ఉంటే ఇంత బాధకరమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఝాన్సీ. ‘చైతన్య మాస్టర్‌ చాలా మంచి వ్యక్తి. తన దగ్గర లేకపోయినా సరే.. సాయం అడిగిన వారికి తప్పకుండా హెల్ప్‌ చేసేవాడు.

గత ఏడాది డిసెంబ‌ర్ 31 కండెక్ట్ చేసిన ఓ ప్రోగ్రామ్‌లో కొంత మంది ఆర్టిస్టులు చైతన్యకు హ్యాండిచ్చారు. దాంతో ఆ క‌మిటీ వాళ్లు మాస్ట‌ర్‌కు రావాల్సిన అమౌంట్‌ను ఆపేశారు. దాదాపు ఆరేడు ల‌క్ష‌ల మొత్త‌మ‌ది. దాని వ‌ల్ల ఒక అప్పు .. అది తీర్చడం కోసం మరో చోట అప్పు. అలా అప్పులు చేసుకుంటూ వ‌చ్చారు. చివరకు ఆ ఒత్తిడి తట్టుకోలేకనే ఇలాంటి క‌ఠిన‌మైన నిర్ణ‌యం తీసుకుని ఉంటారు’’ అన్నది. ‘‘చైత‌న్య మాస్ట‌ర్‌తో ఐదు రోజుల ముందే ప్రోగ్రామ్ చేశాం. చాలా మంచి వ్య‌క్తి. తోటి క‌ళాకారుల‌కు మంచి గౌర‌వం ఇస్తారు.

కమిటీ వాళ్లు డబ్బులు ఇవ్వకపోయినా చైతన్య మాస్ట‌ర్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ల‌కు డ‌బ్బులు ఇవ్వ‌టం కోసం వాళ్ల ద‌గ్గ‌ర, వీళ్ల ద‌గ్గ‌ర అప్పులు తెచ్చి పేమెంట్స్ స‌ర్దారు. మోసం చేయ‌కూడ‌ద‌ని తోటి క‌ళాకారుల‌కు అప్పు తెచ్చి మ‌రీ డ‌బ్బులు ఇచ్చారు. చివరకు ఆయనకు ఇలాంటి పరిస్థితి వచ్చింది’’ అని వాపోయింది. ‘‘ప్రోగ్రామ్‌ ఆర్గనైజర్స్‌కు నేను చేసే విన్నపం ఒక్కటే. ఓ ప్రోగ్రామ్‌లో చేస్తాం అని మాట ఇచ్చినప్పుడు.. మాకు ఆరోగ్యం బాగాలేకపోయినా.. ఇతర సమస్యలున్నా సరే.. తప్పకుండా ప్రోగ్రామ్‌ పూర్తి చేస్తాం. మీకు మా పెర్ఫామెన్స్‌ నచ్చితేనే మరోసారి పిలవండి. అంతేకానీ ఇలా పేమెంట్స్‌ ఆపి.. మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు.

చైతన్య మాస్టార్‌ విషయంలో ఇలానే జరిగింది. అందుకే ఆయన ఆర్టిస్టులకు డబ్బులు ఇవ్వలేక, వాళ్ల ఫోన్‌ కాల్స్‌ ఎత్తి సమాధానం చెప్పలేక.. ఈ నిర్ణయం తీసుకుని ఉండి ఉంటారు అని చెప్పుకొచ్చింది’’ ఝాన్సీ. ఆర్టిస్టిట్ లకు ఇవ్వాల్సిన పేమెంట్స్‌ కోసం మాత్రమే కాక.. తన చెల్లి పెళ్లి కోసం కూడా చైతన్య బయట కొందరి దగ్గర అప్పు చేసినట్లు తెలిసింది. ఈ ఒత్తిడి భరించలేక.. ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఇక చైతన్య మృతిపై శేఖర్‌ మాస్టార్‌, శ్రద్ధా దాస్‌, యాంకర్‌ రష్మి, ఇతర డీ కంటెస్టెంట్స్‌ సంతాపం వ్యక్తం చేశారు. చైతన్య ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదని కన్నీటి పర్యంతం అయ్యారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus