Jhanvi, Sara: ఆ హోటల్లో ఆ మూడు గంటలు మామూలుగా లేదట!

మంచు ప్రదేశాలకు వెళ్లినప్పుడు, అక్కడ హోటల్లో ఉండేటప్పుడు కచ్చితంగా హీటర్‌ ఉండాల్సిందే. ఈ విషయంలో చాలా సాధారమైనదే. అయితే ఈ కామన్‌ విషయాన్ని మరచిపోయి జాన్వీ కపూర్‌ని సారా అలీ ఖాన్‌ ఇబ్బందుల్లోకి నెట్టేసింది తెలుసా. దీని వల్ల జాన్వీ మూడు గంటలపాటు చలిలో వణికి వణికి తీవ్ర ఇబ్బందిపడిందట. కేదార్‌నాథ్‌లో జరిగిన ఈ విషయాన్ని ఇటీవల జాన్వీ, సారా వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లో ఓ సినిమా షూటింగ్‌ కోసం వెళ్లిన జాన్వీకి కేదార్‌నాథ్‌ వెళ్దామని అనిపించిందట.

దీంతో అక్కడికి దగ్గరల్లోనే మరో సినిమా షూటింగ్‌ కోసం ఉన్న సారాను అడిగిందట. దానికి సారా సరే అనడంతో… ఇద్దరూ పయనమయ్యారట. కేదార్‌నాథ్‌ వెళ్లి అక్కడ దర్శనం చేసుకొని తిరిగి హోటల్‌కి చేరుకున్నారట. అయితే పక్కన ఉన్న మరో దేవాలయానికి వెళ్తాను అని జాన్వీని అక్కడే ఉంచి సారా వెళ్లిందట. రిటర్న్‌ వచ్చి చూసేసరికి సారా భయపడిందట. కేదార్‌నాథ్‌లో అప్పుడ టెంపరేచర్‌ -11 డిగ్రీలు ఉందట. ఇంకేముంది చలికి తట్టుకోలేక జాన్వీ గదిలో ఉన్న దుప్పట్లు, రగ్గులు చుట్టేసిందట.

అలాగే తనతోపాటు తెచ్చుకున్న డ్రెస్‌లు అన్నీ వేసుకుందట. అయినప్పటికీ చలి తట్టుకోలేక పెదాలు నీలంగా మారిపోయాయట. హోటల్‌ రూమ్‌లో హీటర్‌ లేకపోవడంతో ఆ ఇబ్బంది తలెత్తిందని జాన్వీ చెప్పుకొచ్చింది. కనీసం అక్కడున్నంత సేపు బాత్‌రూమ్‌కి కూడా వెళ్లలేకపోయాను అని చెప్పింది. దగ్గరలో ఉనప్న భైరవనాథ్‌ను దర్శించుకుని సారా రూమ్‌కి వచ్చాక చూసి షాక్‌ అయ్యిందట. ఏమైంది జాన్వీ అని అడిగితే.. బాబోయ్‌ ఈ చలేంటి.. అనిందట.

దీంతో సారా వెంటనే అక్కడి నుండి సినిమా కోసం తనకు ఇచ్చిన రూమ్‌కి తీసుకెళ్లిందట. అక్కడ హీటర్‌ ఉండటంతో.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుందట. అయితే ముందు ఉన్న రూమ్‌ రెంట్‌ రూ. 6 వేలు కావడంతోనే తీసుకున్నానని, డబ్బులు తక్కువ పడుతున్నాయనేదే తన ఆలోచన అని సారా చెప్పింది. ఇప్పుడు వినడానికి ఇంత నవ్వులుగా ఉన్నా.. అప్పుడు జాన్వీ పరిస్థితి ఆలోచిస్తుంటే వామ్మో అనిపిస్తుంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus