ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ సౌత్ సినిమా మీద దృష్టి పెట్టింది. ఎంతగా అంటే ఏకంగా రూ.4000 కోట్లతో సౌత్‌లో 25 ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేసింది. ఇందులో కొన్ని ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్‌ల కొత్త సీజన్లు, రన్నింగ్‌లో ఉన్న షోస్ కావడం గమనార్హం. ‘సౌత్ అన్‌బాండ్’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించి దక్షిణాదిలో త్వరలో తాము తీసుకురాబోయే కార్యక్రమాల గురించి వివరించింది. ఈ కార్యక్రమానికి అగ్ర కథానాయకులు కమల్ హాసన్, మోహన్‌లాల్, నాగార్జున, ఉయనిధి స్టాలిన్ తదితరులు హాజరయ్యారు. అయితే నష్టాల్లో ఉన్నామని టీ20 ప్రపంచకప్ స్ట్రీమింగ్ నుండి జియో హాట్‌స్టార్ పక్కకు తప్పుకుందని వార్తలొచ్చిన సమయంలోనే ఈ పెట్టుబడి, ప్రాజెక్ట్‌ల విషయం బయటకు రావడం గమనార్హం.
తెలుగు ప్రాజెక్ట్‌లు ఇవీ
నాగార్జున ‘బిగ్ బాస్’, ఐశ్వర్య రాజేశ్ ‘మూడు లాంతర్లు’, ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’, కాజల్ ‘విశాఖ’, విశ్వదేవ్ రాచకొండ – శివాత్మిక ‘వరం’, ‘బ్యాచ్‌మేట్స్’, చైతన్య కృష్ణ – ప్రియదర్శి – అభినవ్ గొమటం ‘సేవ్ ది టైగర్స్ 3’, రాధా నాయర్ – శ్రీముఖి ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’, ‘రోడీస్’.
తమిళ ప్రాజెక్ట్‌లు ఏంటంటే?
విజయ్ సేతుపతి ‘బిగ్‌బాస్’, ప్రియమణి ‘గుడ్‌వైఫ్ 2’, విక్రాంత్ – నియతి కదంబి ‘ఎల్‌బీడబ్ల్యూ’, జీవీ ప్రకాశ్ – అనస్వర రాజన్, మేఘన సుమేశ్ ‘లక్కీ ది సూపర్ స్టార్’, విజయ్ కుమార్ రాజేంద్రన్ – తలైవాసల్ విజయ్ ‘రిసార్ట్’, అనుమోల్ – కార్తిక్ కుమార్ – దీపా బాలు ‘హార్ట్‌బీట్ 3’, కార్తిర్ – దివ్య భారతి ‘లింగమ్’, జయప్రకాశ్ – జయసుధ – గౌరీ కిషన్ ‘లవ్ ఆల్వేజ్’, విజయ్ సేతుపతి, మిలింద్ సోమన్ ‘కాట్టాన్’, ‘సెకండ్ లవ్’.
మలయాళ ప్రాజెక్ట్‌లు ఇలా..
మోహన్‌లాల్ ‘బిగ్‌బాస్’, అజు వర్గీస్ – లాల్ అర్జున్ రాధాకృష్ణన్ ‘కేరళ క్రైమ్ ఫైల్స్ 3’, ‘కజిన్స్ అండ్ కల్యాణమ్స్’, మీనా – హకీమ్ ‘సీక్రెట్ స్టోరీస్: రోజ్లిన్’, లియోనా లిషోయ్ – నిఖిల విల్ ‘అనాలి’, నీనా గుప్తా – రెహ్మాన్ ‘1000 బేబీస్ 2’, నివిన్ పౌలీ – రజిత్ కపూర్ – శ్రుతి రామచంద్రన్ ‘ఫార్మా’, ‘కామెడీ కుకీస్’. కన్నడలో సుదీప్ ‘బిగ్‌బాస్’ ఒకటే ఉంది.