John Abraham: ‘సౌత్‌’ దెబ్బ చూశాడు.. ఇప్పుడు ‘ఓటీటీ’ దెబ్బ చూస్తాడా!

ఆ మధ్య ‘ఎటాక్‌’ సినిమా విడుదలకు ముందు బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహమ్‌ చేసిన ‘సౌత్‌’ వ్యాఖ్యలు ఎంత వైరల్‌ అయ్యాయో తెలిసిందే. ‘నేను బాలీవుడ్‌ హీరోను, సౌత్‌లో సినిమాలు చేయను’ అని అన్నాడు. ఆ మాటలకు సౌత్‌ మీడియా అతన్ని ఏకి పారేసింది. దీంతో అతను తల పట్టుకుని కూర్చున్నాడు అని అంటారు. ఇప్పుడు మరోసారి జాన్‌ అలాంటి వ్యాఖ్యలే చేశాడు. అయితే ఈసారి ఓటీటీల మీద పడ్డాడు. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి.

జాన్ అబ్రహమ్‌ నటించిన ‘ఏక్ విలన్ రిటర్న్స్’ సినిమా జులై 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న జాన్‌ తన సినిమా ఓటీటీ విడుదలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తనకు ఓటీటీ కన్నా థియేటర్లలో సినిమా విడుదల కావడమే ఇష్టమని చెప్పాడు. అక్కడితో ఆగకుండా ‘హీరోగా నాకు బిగ్ స్క్రీన్ పై కనిపించడమే ఇష్టం. అదే నిర్మాతగా అయితే ఓటీటీని ఇష్టపడతాను. నెలకు ₹300, ₹400 కట్టి నా సినిమాలు జనాలు చూడడం ఇష్టం లేదు’’ అని కామెంట్స్‌ చేశాడు జాన్.

‘‘అంత తక్కువ మొత్తానికి నేను ప్రేక్షకులకు అందుబాటులో ఉండడం నచ్చదు. నేను సిల్వర్‌ స్క్రీన్‌ హీరోను.. ఎప్పటికీ అలాగే ఉండాలనుకుంటున్నాను. అయితే నిర్మాతగా మాత్రం ఓటీటీ ప్రేక్షకుల కోసం సినిమాలు నిర్మిస్తాను’’ అని చెప్పాడు. దీంతో ఇప్పుడు జాన్‌ అబ్రహమ్‌ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. హీరోగా ఓటీటీకి వద్దు అని చెప్పే జాన్‌, నిర్మాతగా వేరే హీరోని ఓటీటీకే పరిమితం చేస్తాడా అని కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు.

సౌత్‌ వ్యాఖ్యలతో ఆ మధ్య నెటిజన్లకు ఆహారం అయిన జాన్‌, ఇప్పుడు ఓటీటీ వ్యాఖ్యలతో మరోసారి అదే తరహాలో నిలిచాడు. నిజానికి జాన్‌ ఇలాంటి వైరల్‌ కామెంట్స్‌ గతంలో ఎన్నడూ చేసింది లేదు. ఇటీవల కాలంలో వరుస ఫ్లాప్‌లు వచ్చిన తర్వాతే ఇలా మాట్లాడుతున్నాడని బాలీవుడ్‌ మీడియా అంటోంది. మరి ఇవన్నీ జాన్‌కి వినిపిస్తున్నాయో లేదో.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus