Karthika Nair: ‘జోష్’ హీరోయిన్ కార్తీక ఇప్పుడెలా ఉందో చూస్తే షాకవుతారు..!

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధ అందరికీ సుపరిచితమే. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలందరికీ జోడీగా నటించిన ఈమె తెలుగులో దాదాపు 64 సినిమాల్లో నటించింది. అప్పట్లో ఈమె చాలా బిజీ ఆర్టిస్ట్. ఈమె కాల్ షీట్ల కోసం దర్శకనిర్మాతలు క్యూలో నిలబడేవారు అనడంలో అతిశయోక్తి లేదు.రాధలో స్పెషాలిటీ ఏమిటంటే.. ఈమె డాన్స్ అదగొట్టేస్తుంది. అందుకే ప్రస్తుతం ఈమె పలు డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ వస్తోంది.

అయితే ఈమెలా ఈమె కూతురు కార్తీక క్లిక్ అవ్వలేకపోయింది. నాగచైతన్య డెబ్యూ మూవీ అయిన ‘జోష్’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కార్తీక ఆ సినిమాలో బాగా నటించింది కానీ.. అది ఆమెకు సక్సెస్ ఇవ్వలేకపోయింది. దీంతో మళ్ళీ ఈమె తెలుగులో అవకాశం సంపాదించుకోవడానికి చాలా టైం పట్టింది. కొంత గ్యాప్ ఇచ్చి చేసిన ‘దమ్ము’ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. తమిళంలో చేసిన ‘రంగం’ మూవీతో మంచి సక్సెస్ అందుకుంది.

అయినా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు.చివరికి హిందీ సీరియల్‌స్ లో కూడా నటించింది కార్తీక.అలా కూడా సక్సెస్ కాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. కార్తీక అండ్ ఫ్యామిలీ యు.టి.ఎస్ గ్రూప్ ల హోటళ్లను నడుపుతున్న నేపథ్యంలో..ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ వాటిపైనే పెట్టిందట.!రాధ అలాగే కార్తీక సన్నిహితులు అప్పుడే తొందరపడొద్దు అని చెప్పినా ఈమె వినలేదట. మరి భవిష్యత్తులో ఈమె రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందో లేదో చూడాలి..! అలాగే ఈమె లేటెస్ట్ ఫోటో కూడా వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus