Josh Ravi: జబర్దస్త్ కు వెళ్లకపోవడానికి అదే కారణం: జోష్ రవి

బుల్లితెరపై ప్రసారమవుతు ఎంతోమందికి మంచి లైఫ్ ఇచ్చినటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. కామెడీ షోగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సందడి చేసిన వారికి ఎంతో మంచి లైఫ్ ఇచ్చిందని చెప్పాలి..ఇలా ఈ కార్యక్రమంలో కమెడియన్స్ గా చేసిన వారందరూ ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా నటించి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుంటు ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటుడు జోష్ రవి ఒకరు.

ఈయన కెరియర్ మొదట్లో జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేశారు. అయితే ఈయనకు సినిమా అవకాశాలు రావడంతో ఈ కార్యక్రమం నుంచి తప్పుకొని వెండితెరపై సందడి చేస్తున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జోష్ రవి జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణాలను తెలియజేశారు. ఈ సందర్భంగా జోష్ రవి మాట్లాడుతూ తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి బయటకు వచ్చి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాను.

అయితే ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను నాలుగు సార్లు ఈ కార్యక్రమానికి గెస్ట్ గా వెళ్లాలని తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో కొనసాగడానికి తాను తిరిగి జబర్దస్త్ వెళ్ళనని తెలిపారు. నాకు లక్షల్లో రెమ్యూనరేషన్ ఇచ్చిన కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళనని తెలిపారు..తాను సినిమాలనే లక్ష్యంగా చేసుకొని ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.

నా లక్ష్యం సినిమాలు కావడంతోనే తాను (Josh Ravi) జబర్దస్త్ కార్యక్రమానికి తిరిగి వెళ్లాలనుకోవడం లేదు అంటూ జోష్ రవి జబర్దస్త్ కార్యక్రమం గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన ప్రస్తుతం పలువురు స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus