Jr NTR: హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యాక తారక్‌ తొలి ట్వీట్… ఆ దేశం కోసమే!

  • January 2, 2024 / 05:31 PM IST

కొత్త సంవత్సరాన్ని హాలీడేతో స్వాగతిద్దామని యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన ఫ్యామిలీతో జపాన్‌ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడ భూకంపం వచ్చి సునామీ హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో అభిమానులు కంగారు పడ్డారు. తారక్‌ ఎలా ఉన్నాడు? ఫ్యామిలీ ఎలా ఉంది? అని ఆందోళన చెందారు. అయితే తారక్‌ క్షేమంగా హైదరాబాద్‌ వచ్చేశాడు. అంతేకాదు ఆ దేశం గురించి తన ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశాడు. ‘‘జపాన్ నుండి ఇవాళే ఇంటికి వచ్చాను.

అక్కడ సంభవించిన భూకంపం గురించి తెలిసి షాక్ అయ్యాను. గత వారం అంతా అక్కడే ఉన్నాను. భూకంపం బారిన పడిన ప్రజల గురించి ఆలోచిస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. జపాన్‌ వాసులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. జపాన్ ప్రజలూ ధైర్యంగా ఉండండి’’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. దీంతో ఆయన అభిమానులు కూడా ఆ ట్వీట్‌ కింద జపాన్‌ వాసులకు ధైర్యం చెబుతున్నారు. తనయులు అభయ్ రామ్, భార్గవ్ రామ్, భార్య ప్రణతితో కలసి ఎన్టీఆర్ గత వారం జపాన్ వెళ్లారు.

ఆయన అక్కడకు చేరుకున్నప్పుడు స్థానిక (Jr NTR) తారక్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వారి ప్రేమకు తారక్ ఫిదా అయిపోయాడు. తారక్‌ సినిమాలను ఇప్పటికే జపాన్‌ వాసులు తెగ లైక్‌ చేస్తుంటారు. పాటలకు డ్యాన్స్‌లు వేసి సోషల్ మీడియాలో షేర్‌ చేస్తుంటారు ఊడా. ఇక జపాన్ భూకంపం విషయానికొస్తే… రిక్టర్‌ స్కేల్‌పై తీవ్ర 7.4గా నమోదైంది. సెంట్రల్ జపాన్‌లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. భూకంపం నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

తీరప్రాంతాలను అప్రమత్తం చేశారు. సముద్రపు అలలు 5 మీటర్ల ఎత్తులో ఎగిసిపడి తీర ప్రాంతాలను ముంచేసే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం జపాన్‌లో కనీసం ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. అయితే మరోసారి భూప్రకంపనలు, సునామీ వచ్చే ప్రమాదం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో తీర ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus