Jr NTR, Vijay: విజయ్ అలాంటి వ్యక్తి అంటున్న తారక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చరణ్, తారక్ ఎన్నో కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతంగా డ్యాన్స్ చేసే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. క్లిష్టమైన డ్యాన్స్ స్టెప్స్ ను కూడా సులువుగా చేసే హీరోగా ఎన్టీఆర్ కు పేరుంది. ఎన్టీఆర్ డ్యాన్స్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఫోటోను చూపించి విజయ్ పై మీ అభిప్రాయం ఏమిటనే ప్రశ్న ఎన్టీఆర్ కు ఎదురైంది.

ఆ ప్రశ్నకు తారక్ స్పందిస్తూ హీరో విజయ్ సూపర్ స్టార్ అని మంచి డ్యాన్సర్ అని లవ్లీ పర్సన్ అని మంచి ఫ్రెండ్ అని వాటికి మించి గైడ్ అని తారక్ చెప్పుకొచ్చారు. చివరిగా విజయ్ మంచి మానవతావాది అని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. యాంకర్ చరణ్, రాజమౌళిని అడగకుండా కేవలం ఎన్టీఆర్ ను మాత్రమే విజయ్ గురించి అడిగారు. యాంకర్ ఈ విధంగా అడగటానికి ముఖ్యమైన కారణమే ఉంది.

కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్, విజయ్ డ్యాన్స్ విషయంలో మా హీరో గ్రేట్ అంటే మా హీరో గ్రేట్ అంటూ అభిమానుల మధ్య వివాదం మొదలైంది. ఆ వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని యాంకర్ ఎన్టీఆర్ ను విజయ్ గురించి ప్రశ్నించారని తెలుస్తోంది. ఎన్టీఆర్ మాత్రం ఈ మధ్య కాలంలో వివాదాలకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయ్ గురించి ఎన్టీఆర్ పాజిటివ్ గా స్పందించడంతో విజయ్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో సంతోషిస్తున్నారు.

కొన్నేళ్ల క్రితం నెలకొన్న వివాదానికి తన మాటల ద్వారా తారక్ చెక్ పెట్టారనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ మూవీతో తారక్, చరణ్ కష్టానికి తగిన ఫలితం దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus