Prashanth Neel: ‘సలార్‌ 2’ మీద క్లారిటీ వచ్చేసినట్లే.. తారక్‌ ఎప్పుడొస్తాడు మరి!

‘సలార్‌: ది సీజ్‌ ఫైర్‌’ (Salaar) సినిమా వచ్చిన నెలకో, నెలన్నరకో ‘సలార్‌: శౌర్యాంగ పర్వం’ సినిమా షూటింగ్‌ మొదలవుతుంది అని టీమ్‌ చెప్పింది. అదిగో, ఇదిగో అని కొన్ని రోజులు అన్నారు. ఆ తర్వాత సినిమా గురించి ఎలాంటి స్పందన లేదు. ఈలోపు తారక్‌ సినిమా పనులు మొదలయ్యాయని చెప్పారు. అయితే తన బావమరిది ‘బఘీరా’ పనులు చూస్తున్నారు ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) అంటూ మరో మాట బయటకు తీసుకొచ్చారు. దీంతో క్లారిటీ పూర్తి స్థాయిలో మిస్‌ అయింది.

Prashanth Neel

అయితే ‘బఘీరా’ విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ప్రశాంత్ నీల్‌ లైనప్‌, తర్వాత మొదలయ్యే సినిమా గురించి ఓ క్లారిటీ వచ్చింది. ప్రశాంత్‌ నెక్స్ట్‌ సినిమా వచ్చే నెలలోనే ప్రారంభమవుతుంది అని చెబుతున్నారు. నవంబరు రెండో వారంలో సినిమా షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్‌ చేస్తున్నారట. అయితే షూటింగ్‌లో తారక్‌ ఉండడట. ఎన్టీఆర్‌ లేని సన్నివేశాలను తొలుత చిత్రీకరించాలని ప్లాన్‌ చేస్తున్నారట. త్వరలో తారక్‌ వస్తాడని చెబుతున్నారు.

‘దేవర’ (Devara)  సినిమాతో ఇటీవల ఘన విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్‌ (Jr NTR)  ‘వార్‌ 2’ కోసం కసరత్తులు వెంటనే ప్రారంభించేశాడు. త్వరలో కీలక షెడ్యూల్‌ కోసం ముంబయి వెళ్లనున్నాడు. అది పూర్తయిన వెంటనే ప్రశాంత్‌ సినిమా సెట్‌లోకి అడుగుపెడతాడు. ఆ సినిమా (రెండు పార్టులు అయితే ఫస్ట్‌ పార్ట్‌) తర్వాత ‘దేవర 2’ స్టార్ట్‌ చేస్తారు అని చెబుతున్నారు. మరోవైపు ‘దేవర’ విజయం తర్వాత తారక్‌ ఓ ప్రకటన కూడా విడుదల చేశాడు.

గత నెల రోజులుగా మన సినిమాను పండగలా భావించి… భుజాలపై మోసి ఘన విజయాన్ని అందించారు. ప్రేక్షకులు, అభిమానుల ప్రేమాభిమానాలే నన్ను ఈ స్థాయికి చేర్చాయి. అందుకే వాళ్లు గర్వపడే సినిమాలే చేయడానికి ప్రయత్నిస్తాను అని తారక్‌ తన సోషల్‌ మీడియాలో నోట్‌లో పేర్కొన్నారు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.500 కోట్లకుపైగా వసూలు చేసిందని అభిమానుల కోసం ఇటీవల టీమ్‌ ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది.

కంగువా 2000 కోట్లేమో గాని.. పిడుగు పడేది.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus