Kanguva: కంగువా 2000 కోట్లేమో గాని.. పిడుగు పడేది.!

కంగువా (Kanguva) .. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న ప్రాజెక్టు. దర్శక నిర్మాతలు ఈ సినిమాపై చూపిస్తున్న కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు. పక్కా 2000 కోట్ల సినిమా అవుతుందని బల్లగుద్ది చెబుతున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోలు ఎంతమంది ఉన్నా ఇప్పటివరకు 1000 కోట్ల నెంబర్ చూడలేదు. దీంతో కంగువా తమ రేంజ్ ను పెంచుతుందని ఆడియెన్స్ కూడా గట్టిగానే లేపుతున్నారు. అసలైతే ఈ సినిమా దసరా టైమ్ లొనే రావాలి.

Kanguva

అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ మళ్ళీ వివిధ కారణాల వలన వెనుకడుగు వేయాల్సి వచ్చింది. కారణం ఏదైనా వాయిదా మాత్రం కంగువా మంచికే జరిగింది. ఎందుకంటే ఈ టైమ్ లో వచ్చి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది. తమిళనాడులో భారీ వర్షాలకు ప్రధాన నగరాలు దారుణంగా మారాయి. కార్లు బైకులు నెల మీద పార్క్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఫ్లై ఓవర్లు పార్కింగ్ ప్లేస్ లా మారిపోయింది.

ఇక కంగువా ఈ టైమ్ లో వచ్చి ఉంటే వర్షాల కారణంగా బాక్సాఫీస్ వద్ద టిక్కెట్లు వృధాగా తడిసిపోయేవి. 2000 కోట్లు కొట్టేదో లేదో గాని నిర్మాతల మీద మాత్రం పెద్ద పిడుగే పడేది. ముఖ్యమైన సొంత భాషలోనే కలెక్షన్స్ రాకపోతే చాలా కష్టం. లోకల్ గా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయనే ఆలోచనతో ఉన్నారు. ఇక అతి వర్షాల కారణంగా తమిళనాడులో చాలా థియేటర్స్ మూతపడ్డాయి.

దీంతో కంగువా ఆలస్యం అమృతంగా మారింది. ఇక ఫైనల్ గా సినిమాను నవంబర్ 14న విడుదల చేయనున్నారు. ఇక ఆ లోపు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉండకుండా ఉంటే కంగువా ఓపెనింగ్ కలెక్షన్స్ బాగుంటాయి.

అక్కినేని కాంపౌండ్ లో పూరి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus