Narne NIthin: ఎప్పటికీ నా ఫేవరెట్ హీరో బావ ఎన్టీఆరే :నార్నే నితిన్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన బాల నటుడుగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇలా బాల నటుడిగా నటించి మెప్పించినటువంటి ఎన్టీఆర్ అనంతరం హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కూడా అందుకున్నారు…

ఇక ఎన్టీఆర్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న తరుణంలోనే ఈయన భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఈయన మ్యాడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకొని సందడి చేస్తోంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నార్నే నితిన్ పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలలో భాగంగా ఎన్టీఆర్ గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.

బావ నుంచి నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయని తెలిపారు. ఆయన వద్ద రోజుకు 10 విషయాలు నేర్చుకున్న సంవత్సరం పొడుగునా నేర్చుకునేవే ఉంటాయి. ఇక బావ నటన డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ తన బావ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా తెలియజేశారు. ఇక మీరు మీ అక్క లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ కి ఇచ్చే పెళ్లి చేసిన తర్వాతనే ఆయనకు అభిమానిగా మారిపోయారా అనే ప్రశ్న ఈయనకు ఎదురయింది.

ఇలా నితిన్ (Narne NIthin) సమాధానం చెబుతూ మా అక్కని బావకిచ్చి పెళ్లి చేయకముందు నుంచి నేను ఎన్టీఆర్ గారికి చాలా పెద్ద అభిమానిని తెలియజేశారు. బావ నటించిన సింహాద్రి సినిమా సమయంలో ఏకంగా సినిమాలో చూపించిన విధంగానే అలాంటి కడియం తాను కూడా తయారు చేయించుకొని వేసుకున్నాను అంటూ నితిన్ ఈ సందర్భంగా ఎన్టీఆర్ అంటే తనకు ఎంత అభిమానం ఉంది అనే విషయాన్ని వెల్లడించారు.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus