NTR New Car: రూ.5 కోట్ల విలువగల ఎన్టీఆర్ కారు ఇప్పటికొచ్చింది..!

4 నెలల క్రితం ఎన్టీఆర్ కొత్త కారు కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే .’లాంబోర్గిని ఉరుస్’‌ అనే కారుని మార్చిలో ఎన్టీఆర్ కొనుగోలు చేశాడు.దీని ధర రూ.5 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. ఇటలీ నుండీ ఈ కారు దిగుమతి అయినట్టు తెలుస్తుంది.ఇలా ఇంపోర్ట్ చేసుకోవడానికి మరో రూ.10లక్షల వరకూ ఖర్చు అవుతుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ కొత్త కారు రాంచరణ్ ఇంటి వద్ద దర్శనమివ్వడం మరో విశేషం.ఈ కారుకి లగ్జరీ ఫీచర్స్‌తో పాటు సేఫ్టీకి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని సమాచారం.

ఇంటీరియర్ కూడా అదిరిపోయింది అనే చెప్పాలి. ఇలాంటి కారు ఇప్పటి వరకు హైదరాబాద్‌లో మరెవరికీ లేదు. అందుకే ఏరికోరి మరీ ఎన్టీఆర్ ఈ కారుని కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.తన పెద్ద కొడుకు అభయ్ రామ్ పుట్టినరోజు నాటికి ఈ కారు హైదరాబాద్లో ఉండాలని ఎన్టీఆర్ కోరుకున్నాడు. అతను అనుకున్నట్టే జరిగింది. సినిమా జనాలు మార్కెట్లోకి వచ్చే ప్రతీ కారుని కొనుగోలు చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ కూడా కొత్త కారుని కొనుగోలు చేసాడు.

అక్కినేని ఫ్యామిలీ మెంబెర్స్ కూడా కొత్త కొత్త కార్లు, బైకులు కొంటూ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus