దర్శకులు సినిమాలు తీయడం మీద దృష్టి పెట్టాలి. మిగతా విషయాల గురించి పట్టించుకోవద్దు. అప్పుడే ఇండస్ట్రీలో మంచి సినిమాలొస్తాయి.. ఈ మాటలు ఎక్కడో విన్నట్లు ఉంది కదా. మొన్నీమధ్య ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి చెప్పిన మాటలివి. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నారో క్లియర్‌గా చెప్పలేదు కానీ. ఎవరి గురించి అన్నారో అందరికీ తెలుసు. అయితే ఇదే సమయంలో మరో దగ్గర మరో పని జరిగింది అని చెబుతున్నారు. ఓ దర్శకుడికి హీరో నుండి క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చాయట.
‘ఆచార్య’ సినిమా విడుదల అయిన వెంటనే మా సినిమా ఉంటుంది అంటూ.. ఆ మధ్య ఎన్టీఆర్ సినిమా గురించి కొరటాల శివ చాలా సార్లు చెప్పారు. అయితే ‘ఆచార్య’ దారుణమైన ఫలితం తర్వాత చూస్తే.. అంతా మారిపోయింది. ఎన్టీఆర్ సినిమా ఇంకా మొదలవ్వలేదు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం అయితే ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఈసారి కొరటాల కేవలం దర్శకత్వానికి మాత్రమే పరిమితం అవుతున్నారట.
అదేంటి.. కొరటాల కేవలం దర్శకత్వం మాత్రమే చేస్తారు కదా అని అనుకుంటున్నారా? అయితే మేం చెప్పిన తొలి వాక్యాలు మరోసారి చదువుకోండి. ఎందుకంటే కొరటాల శివ దర్శకుడిగానే మాత్రమే కాదు సినిమా ప్రొడక్షన్‌లోనూ చురుగ్గా పాల్గొంటారని టాక్. ఆయన గత సినిమాలను చూస్తే ఈ విషయం తెలిసిపోతుంది. ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’, ‘ఆచార్య’ సినిమాల డిస్ట్రిబ్యూషన్ వ్యవహారంలో ఆయన కీలకంగా వ్యవహరించారు అంటారు.
దీంతో ఎన్టీఆర్ 30 సినిమా విషయంలో కేవలం దర్శకత్వం మాత్రమే చూసుకుంటే బాగుంటుందని సూచన వచ్చింది అని అంటున్నారు. అయితే ఇది నిజమా కాదా అనేది సినిమా పూర్తయితే కాని తెలియదు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం దసరా తర్వాత ఈ సినిమా మొదలవుతుంది అని సమాచారం. సినిమా నిర్మాణం, వ్యాపార లావాదేవీలు కొరటాల మిత్రుడు సుధాకర్ మిక్కిలినేని, కల్యాణ్ రామ్ చూసుకుంటారట.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!