Jr NTR: మెగా నందమూరి పోరుపై తారక్ షాకింగ్ కామెంట్స్!

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ల విషయంలో చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి వేగం పెంచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు ఇతర విశేషాలను హీరోలు, దర్శకుడు మీడియాతో పంచుకుంటున్నారు. మెగా, నందమూరి హీరోలు ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి నటించడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మల్టీస్టారర్స్ గురించి తారక్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మెగా, నందమూరి కుటుంబాల మధ్య ఉన్న పోరు గురించి తారక్ స్పందించారు. 35 సంవత్సరాలుగా రెండు కుటుంబాల మధ్య పోరు ఉందని తారక్ చెప్పుకొచ్చారు. అయితే పోరు ఉన్నా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని తారక్ వెల్లడించారు. చరణ్ కు, తనకు మధ్య ఉన్న పోటీ ఆరోగ్యకరమైన పోటీ అని తారక్ పేర్కొన్నారు.

చిరంజీవి బాలయ్య అభిమానుల మధ్య కొన్నేళ్ల క్రితం వరకు పోరు నడిచింది. కొన్ని సందర్భాల్లో చిరంజీవి పై చేయి సాధిస్తే మరికొన్ని సందర్భాల్లో బాలయ్య పై చేయి సాధించారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మెగా హీరోలతో స్నేహపూర్వకంగా మెలిగారు. మెగా హీరోలు సైతం తారక్ గురించి పలు సందర్భాల్లో పాజిటివ్ గా కామెంట్లు చేశారు. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితో తారక్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కుతుందని చరణ్, తారక్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఖర్చు విషయంలో రాజీ పడకుండా దానయ్య ఈ సినిమాను నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలను పెంచారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ సాధిస్తే తెలుగులో మరిన్ని భారీ మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. రికార్డు స్థాయి స్క్రీన్లలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుందని సమాచారం.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus