ప్రతి ఒక్కరికీ కొన్ని పాటలు అమితంగా నచ్చితే మరికొన్ని పాటలు అస్సలు నచ్చవు. అయితే చాలామంది సెలబ్రిటీలు తమకు నచ్చని పాటల విషయంలో రియాక్ట్ కావడానికి అస్సలు ఇష్టపడరు. అయితే తాజాగా కీరవాణి చరణ్, తారక్ లను ఇంటర్వ్యూ చేసే సమయంలో తన సాంగ్స్ లో నచ్చని సాంగ్ ఏంటో చెప్పాలని కోరారు. ఆ ప్రశ్నకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అస్సలు తడుముకోకుండా ఘరానా బుల్లోడు సినిమాలోని భీమవరం బుల్లోడా సాంగ్ తనకు అస్సలు నచ్చదని చెప్పుకొచ్చారు.
నాగార్జున హిట్ సాంగ్ ను ఎన్టీఆర్ చెత్త పాట అని చెప్పడం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ కు నచ్చని ఈ పాట తర్వాత రోజుల్లో రీమిక్స్ కూడా అయిందనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ లిరిక్స్ వల్ల తనకు ఆ పాట నచ్చకపోయి ఉండవచ్చని వెల్లడించడం గమనార్హం. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఉండటం వల్లే ఆ పాట తారక్ కు నచ్చలేదని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భీమవరం బుల్లోడా సాంగ్ లో వచ్చే హమ్మింగ్ అంటే తనకు ఇరిటేషన్ అని తారక్ తెలిపారు. అయితే తారక్ ఈ విధంగా చెప్పడంతో నాగార్జున ఫ్యాన్స్ మాత్రం ఫీలవుతున్నారు. చరణ్ కూడా కీరవాణి పాటలలో ఒక పాట నచ్చలేదని చెప్పగా ఆ పాట ఏంటో చెప్పే విషయంలో మాత్రం తడబడ్డారు. 2021లో విడుదలైన ఒక చిన్న సినిమాలోని పాట విషయంలో చరణ్ ఈ విధంగా కామెంట్లు చేశారు. చరణ్ శ్రీకాంత్ కొడుకు హీరోగా తెరకెక్కిన పెళ్లిసందడి సినిమా గురించి చెప్పి ఉండవచ్చని కొంతమంది నెటిజన్లు భావిస్తున్నారు.
ఎన్టీఆర్, చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటారేమో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు చరణ్, తారక్ లకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతోంది. ఆర్ఆర్ఆర్ తో ఈ ఇద్దరు హీరోలు పాన్ ఇండియా హిట్ సాధిస్తారేమో చూడాలి.