Jr NTR: ‘బింబిసార’ తో పాటు ‘సీతా రామం’ చిత్రాన్ని కూడా ఆదరించండి: ఎన్టీఆర్

థియేటర్లకు జనాలు రావడం లేదు.. ఇండస్ట్రీకి గడ్డు కాలం వంటి అపోహల్ని నేను నమ్మను అంటున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిధిగా విచ్చేసిన ఎన్టీఆర్ అటు తర్వాత మైక్ పట్టుకుని ఈ చిత్రం గురించి, తన అన్న కళ్యాణ్ రామ్ ఈ చిత్రం కోసం పడిన కష్టం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. పనిలో పనిలో థియేటర్లకు జనం రాకపోవడం పై కూడా స్పందించారు.

ఈ విషయం పై ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీకి గడ్డుకాలం అంటున్నారు, థియేటర్ కి జనం రావడం లేదు అంటున్నారు. ఇవన్నీ నేను నమ్మను, అద్భుతమైన చిత్రం వస్తే చూసి ఆశీర్వదించే గొప్ప హృదయం కలిగినటువంటి తెలుగు ప్రేక్షక దేవుళ్ళు మీరందరూ.! ‘బింబిసార’ ని ఆదరిస్తారని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ అలాగే ‘ బింబిసార’ తో పాటు ఇంకో చిత్రం వస్తుంది ‘సీతా రామం’ అని ఆ చిత్రాన్ని కూడా మీరు ఆదరించి తెలుగు ఇండస్ట్రీకి మీరు ఒక కొత్త ఊపిరిని పోయాలని ఈ ఇండస్ట్రీని పది కాలాల పాటు చల్లగా ఉండి మీ అందరినీ అలరించాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను, మిమ్మల్ని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

అనంతరం కళ్యాణ్ రామ్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ “మీకు నచ్చే వరకు చిత్రాలు చేస్తూనే ఉంటాము. మీకు నచ్చకపోతే ఇంకొకటి, నచ్చకపోతే ఇంకొకటి, మీరు కాలర్ ఎగరేసుకునేలాగా చేయడమే మా బాధ్యత అని.. ! ఈరోజు ఈ స్టేజి పైన చెబుతున్నాను ‘బింబిసార’ చిత్రం మీరు చూసిన తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ గారు కాలర్ ను ఇంకెంత పైకెత్తుతారో మీరే చూస్తారు.మామూలుగానే ఓ చిత్రం కోసం చాలా ఎక్కువగా కష్టపడతారు. మీకు ఆ కష్టం కనిపించదు తమ్ముడిని కాబట్టి ఎక్కువ సార్లు కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు తెలుసు ఆయన ఎంత కష్టపడతారు అనేది” అంటూ చెప్పుకొచ్చాడు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus