Jr NTR: ఎన్టీఆర్ హీరోగా నటించిన ఫస్ట్ సీరియల్ గురించి ఆసక్తికర విషయాలు..!

నందమూరి వంశం నుండి థర్డ్ జనరేషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలనటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి, భారతదేశం గర్వించే నటుడిగా ఎదిగాడు. ఈ తరం యాక్టర్లలో ఆల్ రౌండర్ ఎవరంటే ఠక్కున చెప్పే పేరు తనదే.. పర్ఫార్మెన్స్, డ్యాన్స్, డైలాగ్ డిక్షన్.. ఇలా తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ తో చైల్డ్ ఆర్టిస్టుగా ఇంట్రడ్యూస్ చేశారు తాత ఎన్టీఆర్.. తర్వాత ‘బాలరామాయణం’ లో నటించాడు. నేషనల్ అవార్డ్ అందుకుందీ బాలల చిత్రం..

నవంబర్ 16 నాటికి తారక్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 22 సంవత్సరాలు పూర్తి అవుతోంది.. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. విషెస్ తెలియజేస్తూ.. తారక్ రేర్ పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ.. #22GloriousYearsOfNTR #ManOfMassesNTR హ్యాష్ ట్యాగ్లను ట్రెండ్ చేస్తున్నారు. తారక్ హీరోగా నటించిన ‘నిన్ను చూడాలని’ వచ్చింది 2001లో కదా.. మరి 22 ఏళ్లు ఎలా అవుతుంది?.. అంటే.. దానికి ముందే మనోడు ఓ సీరియల్‌లో ప్రధాన పాత్రలో నటించాడు.

జూనియర్ యాక్ట్ చేసిన ఫస్ట్ సీరియల్ పేరు ‘భక్త మార్కండేయ’.. 20 ఎపిసోడ్లుగా ఈటీవీలో ప్రసారమైంది. రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ తండ్రి వక్కంతం సూర్య నారాయణ దీనికి రచయిత.. వక్కంతం వంశీకి ఎన్టీఆర్ సన్నిహితుడు.. వంశీ, తారక్ కాంబోలో (రచయితగా) ‘అశోక్’, ‘ఊసరవెల్లి’ సినిమాలొచ్చాయి.. ‘నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ మూవీ మొదట ఎన్టీఆర్‌తోనే చేయాలని ప్రయత్నించాడు వంశీ..

ఇన్ని సంవత్సరాల కెరీర్‌లో డిఫరెంట్ జానర్ ఫిలింస్, ఛాలెంజింగ్ క్యారెక్టర్లతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు యంగ్ టైగర్. ‘ఆర్ఆర్ఆర్’ తో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటడమేకాక.. నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలు కూడా తన నటన గురించి మాట్లాడుకునేలా చేశాడు.. జాతీయ రాజకీయ నాయకులు సైతం ఆశ్చర్యపోయేలా చేశాడు. తన 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.. ట్రిపులార్ క్రేజ్ దృష్ట్యా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రెస్టీజియస్‌గా రూపొందించనున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus