NTR, Rajamouli: నీ గురించి ప్రపంచం తెలుసుకునే సమయం ఆసన్నమైంది జక్కన్నా: తారక్

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్నారు. న్యూయార్క్ ఫిలిం క్రిటిక్ సర్కిల్ రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ అవార్డుకి ఎంపికయ్యారు. రాజమౌళిఇలాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ఎంపిక కావడంతో పెద్ద ఎత్తున ఈయనకు శుభాకాంక్షలు వెల్లవెత్తుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ బరిలో కొనసాగుతున్న నేపథ్యంలో రాజమౌళికి ఈ విధమైనటువంటి పురస్కారం రావడం సినిమాకు మరింత ప్రయోజనకరం.

ఈ సినిమా ఆస్కార్ రేసులో ఎక్కువ దూరం ప్రయాణం చేయాలంటే నేషనల్ సొసైటీ ఆఫ్ ఫిలిం క్రిటిక్స్ నుంచి ఈ విధమైనటువంటి అవార్డు రావడం చాలా ముఖ్యం.ఈ క్రమంలోనే ఎంతోమంది ఇండియన్ సెలబ్రిటీస్ జక్కన్నకు దక్కిన గౌరవం పట్ల శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఈ విషయంపై స్పందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజమౌళి శుభాకాంక్షలు తెలుపుతూ..నీ గురించి ఇన్ని రోజులు నాకు తెలిసింది

ఇప్పుడు ప్రపంచం తెలుసుకునే సమయం ఆసన్నమైంది జక్కన్న అంటూ ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఎన్టీఆర్ రాజమౌళి మధ్య ఏ విధమైనటువంటి అనుబంధం ఉందో మనకు తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు వస్తే నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.

ఇలా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం RRR వరకు వచ్చింది. ముందు ముందు వీరి ప్రయాణం ఇలాగే కొనసాగాలని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus