Devara Glimpse ‘దేవర పార్ట్ 1 ‘ గ్లింప్స్ వచ్చేసింది ఎలా ఉందంటే?

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5 న రిలీజ్ కాబోతుంది. ‘యువసుధా ఆర్ట్స్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్. ఇక ఈ చిత్రం నుండి గ్లింప్స్ రాబోతుంది అని రెండు రోజుల క్రితం చిత్ర బృందం తెలిపింది. వాళ్ళు చెప్పినట్టే కొద్దిసేపటి క్రితం ‘దేవర పార్ట్ 1 ‘ గ్లింప్స్ ని విడుదల చేశారు..

‘దేవర’ గ్లింప్స్ నిడివి 1 నిమిషం 16 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఓ పెద్ద షిప్లో కొంతమంది గజదొంగలు దొంగతనం చేయడం.. తర్వాత సముద్రంలో కత్తులు పడేయడం చూపించారు. తర్వాత వాళ్ళని హీరో తెగ నరకడం వంటివి ఈ గ్లింప్స్ లో చూపించారు. ‘ఈ సముద్రం చేపల్ని కంటే కత్తులని, నెత్తురునే ఎక్కువగా చూసింది.. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ చివర్లో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ ఆ తర్వాత వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి హై ఇస్తుంది.

నెలవంకని నెత్తురు మరో నెలవంక ఆకారంలో కలుసుకునే విజువల్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. టోటల్ గా గ్లింప్స్ అదిరిపోయింది. నిజంగానే కళ్యాణ్ రామ్ చెప్పినట్టు ప్రేక్షకులను మరో వరల్డ్ లోకి తీసుకెళ్లే విధంగా ఉంది. దర్శకుడు కొరటాల శివ ఎంతో కసిగా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నట్టు ఈ గ్లింప్స్ చెప్పకనే చెప్పింది. మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus