Jr NTR: మరోసారి మంచి మనస్సు చాటుకున్న తారక్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి మంచి మనస్సును చాటుకున్నారు. కొన్నిరోజుల క్రితం నెల్లూరు, రాయలసీమలోని కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో వరదలు భీభత్సం సృష్టించాయి. వరదల వల్ల పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులు కావడంతో పాటు లక్షల ఎకరాల పంట నీట మునిగింది. వరదల వల్ల చాలామంది ఇల్లు కోల్పోయి దీనస్థితిలో ఉన్నారు. నష్టపోయిన ఏపీ ప్రజలకు తన వంతుగా సాయం చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వచ్చారు.

తన వంతుగా 25 లక్షల రూపాయల సహాయం ప్రకటించిన ఎన్టీఆర్ వరద బాధితుల కష్టాలను చూసి తాను చలించిపోయానని తెలిపారు. తాను చేస్తున్న సహాయం బాధితులు కోలుకోవడానికి తన వంతుగా చేస్తున్న చిన్న సాయమని ఎన్టీఅర్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ వరద సాయం ప్రకటించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు సినీ ప్రముఖులు వరద సాయం ప్రకటిస్తే ఏపీ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పవచ్చు. మరోవైపు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ తో బిజీ కానున్నారు.

ఆర్ఆర్ఆర్ తో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధిస్తానని తారక్ నమ్ముతున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా ఈ సినిమాలో ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా షూటింగ్ పనులతో బిజీ కానున్నారని తెలుస్తోంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus