తాజాగా జరిగిన సైమా అవార్డుల వేడుకలలో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో విభాగాలలో సైమా అవార్డులు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఉత్తమ నటుడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం సైమా అవార్డును అందుకున్నారు. ఇక ఈ వేడుకలు దుబాయ్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ వేడుకలలో భాగంగా ఎన్టీఆర్ నటించిన కొమరం భీం పాత్రకుగాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ వేదికపై ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ వేదికపై మరోసారి ఈయన అభిమానులపై తనకు ఉన్నటువంటి ప్రేమను కూడా తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రకు నేను న్యాయం చేస్తానని నన్ను నమ్మి మళ్ళీ మళ్ళీ నాకు అవకాశాలు ఇస్తున్నటువంటి జక్కన్నకు ముందుగా కృతజ్ఞతలు అంటూ రాజమౌళికి కృతజ్ఞతలు తెలియజేశారు. నా కో స్టార్ మై బెస్ట్ ఫ్రెండ్ నా బ్రదర్ రామ్ చరణ్ కు థాంక్స్ ఎప్పుడు రుణపడి ఉంటాను అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన స్పీచ్ మొదలుపెట్టారు.
నేను కింద పడినప్పుడల్లా, ఒడిదుడుకులలో ఉన్నప్పుడు అంత నా అభిమానులు నన్ను పట్టుకొని పైకి లేపినందుకు నా కళ్ళల్లో కారే ప్రతి కన్నీటి చుక్కకూ అభిమానులు బాధపడినందుకు… నేను సంతోషంలో ఉంటే అభిమానులు కూడా నవ్వినందుకు నా అభిమానులు, సోదరులందరికీ తలవంచి పాదాభివందనాలు చేస్తున్నాను అంటూ ఈయన మాట్లాడారు. ఈ విధంగా ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశిస్తూ ఈ విధంగా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఎన్టీఆర్ కి (Jr NTR) అభిమానులు అంటే ఎంత ప్రేమ ఉంది వారికి ఈయన ఎలాంటి గౌరవం ఇస్తారనే విషయాలు స్పష్టంగా అర్థం అవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ ఏ వేదికలో పాల్గొన్న అభిమానుల గురించి ఇలాగే మాట్లాడుతూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరిచిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!