మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్ అయినప్పటికీ ఎంతో మంది సినీ సెలెబ్రెటీలో రాజకీయ నాయకులు నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ అరెస్టు విషయంపై స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. అయితే ఇప్పటివరకు ఎక్కడా కూడా నందమూరి వారసుడిగా పేరు సంపాదించుకున్నటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. ఇలా ఎన్టీఆర్ ఈ విషయంపై మౌనంగా ఉండడంతో అభిమానులు కూడా కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ మీడియా సమావేశంలో భాగంగా తెలుగుదేశం మాజీ మంత్రి అచ్చన్నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఈ విషయంపై ఎందుకు స్పందించలేదు ఆయననే అడగాలి అంటూ తెలియచేశారు. దీంతో అభిమాని ఈ విషయంపై చాలా అసహనం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ కి బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా రాసినటువంటి లేఖ ప్రస్తుతం వైరల్ అవుతుంది ఇందులో భాగంగా ఎన్టీఆర్ పై తన అసహనాన్ని తెలియజేశారు. మరి ఎన్టీఆర్ (Jr NTR) పట్ల ఆ అభిమాని రాసినటువంటి లెటర్ లో ఏముందనే విషయానికి వస్తే…
గతంలో నిన్ను ప్రాణంగా ప్రేమించిన అభిమానిని.ప్రస్తుతం కేవలం నందమూరి కుటుంబ సభ్యుడిగా నిన్ను గౌరవిస్తున్నా అంతే.కొత్తగా ఎవరో వచ్చి సపోర్ట్ చేశాడని లేకపోతే మీ అవసరం మాకు లేదని నిన్ను అభిమానించడం మానేయలేదు. మా హరన్నలో ఉన్నటువంటి తెగింపు, మా రామన్నలో ఉన్నటువంటి ఆవేశం, మా బాలయ్యలో ఉన్నటువంటి ధైర్యం నీలో కనిపించక.నీ మొండితనం భరించలేక.నీ లోతైన మనస్తత్వం అర్థం చేసుకోలేక, నీ మౌనం సహించలేక నీ మీద ప్రేమను నాకు నేనుగా చంపేసుకున్నా అంటూ రాసిన లేక ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఒక సగటు సినీ ప్రేక్షకుడిగా నేను నీ సినిమాలను చూస్తాను అంతే థాంక్స్ అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ పై అసహనం వ్యక్తం చేస్తూ అభిమాని రాసినటువంటి ఈ లెటర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ సైమ అవార్డు వేడుకలలో భాగంగా దుబాయ్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. వచ్చిన తర్వాత ఆయన కూడా ఈయన చంద్రబాబు నాయుడు అరెస్టు విషయం గురించి మాట్లాడతారా లేదా అన్నది అందరిలోనూ సందేహాలను కలిగిస్తుంది.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!