యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో విదేశాలలో కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. వరుస విజయాలతో సినిమాల్లో సత్తా చాటుతున్న తారక్ రాజకీయాలలో కూడా సక్సెస్ సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది టీడీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేయగా ఆ కామెంట్ల వల్ల తారక్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గమైన కుప్పంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
కుప్పం టౌన్ అంతటా సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు వినిపించాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఒక్కచోట చేరి సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. బాణసంచా కాల్చడంతో పాటు ఎన్టీఆర్ జెండాలను పట్టుకొని డ్యాన్సులు చేశారు. కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ మేనత్త భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన కామెంట్ల గురించి జూనియర్ ఎన్టీఆర్ సాఫ్ట్ గా స్పందించారు. అయితే వర్ల రామయ్య ఎన్టీఆర్ స్పందన సరిగ్గా లేదని కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ ని అణగదొక్కడానికి టీడీపీ నేతలు అలా కామెంట్లు చేశారని వార్తలు వచ్చాయి.
ఎన్టీఆర్ తప్పేం లేదని చెప్పడానికి కుప్పంలోని ఎస్ఆర్ఎం థియేటర్ లో జై లవకుశ స్పెషల్ షోకు ఫ్యాన్స్ హాజరై బాబులకే బాబు తారక్ బాబు అంటూ చంద్రబాబును రెచ్చగొట్టేలా కామెంట్లు చేశారు. కుప్పం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్ల రాజకీయాలలో ఎన్టీఆర్ అలజడి మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ ను తక్కువ చేసి మాట్లాడితే తెలుగుదేశం పార్టీకే నష్టమని తారక్ ఫ్యాన్స్ చెప్పకనే చెబుతున్నారు. ఎన్టీఆర్ చరణ్ తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?