Anirudh Ravichander: ఇండియన్2 విషయంలో నిరాశపరుస్తున్న అనిరుధ్.. కానీ?

  • June 26, 2024 / 09:37 PM IST

మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అని తెలుగులో ఒక సామెత ఉంది. మ్యూజిక్ డైరెక్టర్లు సైతం ఒకే సమయంలో ఎక్కువ సంఖ్యలో ప్రాజెక్ట్స్ కోసం పని చేస్తే ఆ ప్రభావం కచ్చితంగా సినిమాపై పడుతుంది. ఇండియన్2 (Bharateeyudu 2)  సినిమాకు అనిరుధ్ (Anirudh Ravichander) మ్యూజిక్ డైరెక్టర్ కాగా ఈ సినిమా ట్రైలర్ బీజీఎం ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు. తెలుగులో మరో 90 రోజుల్లో విడుదల కానున్న దేవర (Devara) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

దేవర మాస్ సినిమా కావడంతో ఈ సినిమాకు బీజీఎం కచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉండాలనే సంగతి తెలిసిందే. మరి ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న అనిరుధ్ ఈ సినిమాతో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో చూడాల్సి ఉంది. తారక్ కు (Jr NTR) సోలో హీరోగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం కాగా ఈ సినిమాతో ఆ లోటు తీరడంతో పాటు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ తారక్ కు దక్కాలని అభిమానులు భావిస్తున్నారు.

దేవర సినిమా నుంచి త్వరలో సెకండ్ సింగిల్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. దేవర సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవర మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దేవర సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

దేవర సినిమాలో సాంగ్స్, యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉంటే మాత్రం ఈ సినిమా కచ్చితంగా హిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనిరుధ్ దేవర మ్యూజిక్, బీజీఎంతో మెప్పిస్తే మాత్రమే తెలుగులో వరుస ఆఫర్లు వస్తాయి. అనిరుధ్ రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus