Koratala Siva: కొరటాల శివను ఇంతలా టార్గెట్ చేయడం కరెక్టా.. సరికాదంటూ?

  • September 11, 2024 / 09:57 PM IST

మిర్చి (Mirchi)  , శ్రీమంతుడు (Srimanthudu) , జనతా గ్యారేజ్ (Janatha Garage), భరత్ అనే నేను (Bharat Ane Nenu) సినిమాలతో దర్శకుడు కొరటాల శివ  (Koratala Siva) టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించగా ఈ సినిమాలలో అద్భుతమైన మెసేజ్ కూడా ఉంది. కొరటాల శివ ఐదో సినిమాగా ఆచార్య తెరకెక్కగా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిలైన సంగతి తెలిసిందే.

Koratala Siva:

ఆచార్య (Acharya) సినిమా కమర్షియల్ గా కూడా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. అయితే ఒక్క సినిమా ఫ్లాపైనంత మాత్రాన కొరటాల శివ (Koratala Siva) డైరెక్షన్ ను ప్రతి సందర్భంలో విమర్శించడం సరి కాదు. ఎంతోమంది ఫ్లాప్ డైరెక్టర్లకు తారక్ ఛాన్స్ ఇవ్వగా అదే విధంగా కొరటాల శివ ప్రతిభను నమ్మి ఛాన్స్ ఇచ్చారు. ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన ఆ డైరెక్టర్ ప్రతి సినిమా ఫ్లాప్ అవుతుందనేలా కామెంట్లు చేయడం ఎంతవరకు రైట్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొరటాల శివ (Koratala Siva) సినిమాలలో కథ, కథనం బాగుంటాయని వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా ఏ మాత్రం మార్పు రాకుండా రొటీన్ సినిమాలు తీసే డైరెక్టర్లపై ఈ విమర్శలు చేస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు దేవర (Devara) ట్రైలర్ నిజంగా నచ్చకపోతే ఏం నచ్చలేదో చెప్పి విమర్శించవచ్చని కొరటాల స్థాయిని తగ్గించేలా, బాధ పెట్టేలా కామెంట్లు చేయడం మాత్రం సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ట్రైలర్ అంచనాలను అందుకోకపోయినా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సందర్భాలు కోకొల్లలు అనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. కొరటాల శివ తన కష్టంతో కెరీర్ పరంగా ఎంతో ఎదిగాడని దర్శకుడు కాకముందే ఎన్నో హిట్ సినిమాలకు రైటర్ గా, మాటల రచయితగా పని చేశారని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు. దేవర సినిమా రిలీజ్ కాకుండానే కొరటాల విషయంలో హద్దులు దాటి కామెంట్లు చేయడం మాత్రం సరి కాదని ఫ్యాన్స్ చెబుతున్నారు. కొరటాల శివ భవిష్యత్తు ప్రాజెక్ట్స్ గురించి స్పష్టత రావాల్సి ఉంది.

‘బిగ్ బాస్ 8’ : యష్మీ షాకింగ్ కామెంట్స్ వైరల్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus