Jr NTR: వేరే హీరోని చూసుకోవాల్సింది.. జక్కన్నపై గుర్రుగా ఉన్న ఫ్యాన్స్!

  • March 27, 2022 / 05:53 PM IST

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 25న విడుదలైంది. ఈ సినిమా కోసం రాజమౌళి అండ్ టీమ్ చాలా ఏళ్లు కష్టపడింది. ఇద్దరు హీరోలు కూడా ఈ సినిమా కోసం దాదాపు నాలుగేళ్ల సమయాన్ని వెచ్చించారు. అయితే ఈ సినిమా షూటింగ్ దశ నుంచే మెగా, నందమూరి వర్గాలు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Click Here To Watch NOW

తీరా విడుదలైన తరువాత చాలా మంది ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం ప్రతిభను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. హీరోలిద్దరూ రామ్ చరణ్, ఎన్టీఆర్ చాలా కష్టపడ్డారని.. వారి వారి పాత్రలను అనుసరించి సినిమాలో ఈక్వల్ గా ప్రయారిటీ ఇచ్చామని రాజమౌళి పలు సందర్భాల్లో వెల్లడించారు. అయితే సినిమా విడుదలైన తరువాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా అసలు బాలేదని.. మొత్తం రామ్ చరణ్‌కే ప్రాధాన్యం ఇచ్చారని..

ఎన్టీఆర్ ని అసలు వాడుకోలేకపోయారని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ కి పది శాతం స్కోప్ మాత్రమే ఇచ్చారని.. అనవసరంగా తమ హీరో టైం వేస్ట్ చేశారని.. వేరే ఎవరినైనా చూసుకోవాల్సింది అంటూ విరుచుకుపడుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

1920 బ్యాక్ డ్రాప్ లో భారీ విజువల్ వండర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. అలియాభట్, అజయ్ దేవగన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ తో పాటు ఒలీవియా మోరిస్, అలిసన్ లాంటి హాలీవుడ్ స్టార్లు కూడా మెరిశారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus