Jr NTR: వార్2 విషయంలో యంగ్ టైగర్ కు అభిమానుల సూచనలు ఇవే!

  • November 23, 2023 / 10:53 AM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 2024 జనవరి నుంచి వార్2 సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంతో పాటు స్పై యూనివర్స్ లో సంచలనంగా నిలిచే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వార్2 సినిమాలో తారక్ కు జోడీగా శార్వారి నటిస్తున్నారు. అయితే పెద్దగా క్రేజ్ లేని ఈ హీరోయిన్ ను ఎంపిక చేసుకోవడానికి బదులుగా క్రేజ్ ఉన్న హీరోయిన్ ను ఎంపిక చేసుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎన్టీఆర్ కు జోడీగా కియారా అద్వానీ, శ్రద్ధా కపూర్, అలియా భట్ లాంటి స్టార్ హీరోయిన్లు బాగుంటారని ఈ హీరోయిన్లకు ఆఫర్లు ఇవ్వాలని మరి కొందరు కామెంట్లు కామెంట్లు చేస్తున్నారు ఎన్టీఆర్ నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాలి. శార్వారి ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఎన్టీఆర్ దేవర రిలీజ్ కు చాలా సమయం ఉన్నా ఈ సినిమా సంచలనాలను సృష్టిస్తోంది.

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ దేవర మూవీ డిజిటల్ హక్కులను 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంతో కొనుగోలు చేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవర రైట్స్ ఆ రేంజ్ లో అమ్ముడైతే మేకర్స్ కు రికార్డ్ స్థాయిలో లాభాలు ఖాయమని చెప్పవచ్చు. దేవర సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది.

దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. రాబోయే రోజుల్లో దేవర సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా (Jr NTR) తారక్ ఎన్నో జాగ్రత్తలు తీసుకోనున్నారని సమాచారం అందుతోంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus