Jr.NTR: పాత వీడియో ఇంత హాట్ టాపిక్ అయ్యిందేంటి!

జూనియర్ ఎన్టీఆర్ తండ్రి, సీనియర్ ఎన్టీఆర్ కొడుకు అయిన నందమూరి హరికృష్ణ కూడా పలు హిట్ సినిమాల్లో నటించి అలరించారు. ఆ టైంలో తీసుకున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

Jr.NTR

ఈ వీడియోను కనుక గమనిస్తే.. హరికృష్ణ విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు అని అర్థం చేసుకోవచ్చు. అతని వెనుక సీనియర్ నటుడు బ్రహ్మాజీ కనిపిస్తున్నాడు. ఓ విలేకరు.. హరికృష్ణతో ‘కొన్ని మీడియా కథనాల ప్రకారం వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ‘మీది నక్సలైట్ రోల్ అని అంటున్నారు’ అంటూ ప్రస్తావించడం.. వెంటనే హరికృష్ణ ‘అవునా ఓకే..’ అన్నట్టు ఓ సెటైర్ విసరడం జరిగింది. వెంటనే అక్కడున్న వారు నవ్వారు. ఆ తర్వాత ‘నేను ఈ సినిమా సత్యం అనే పాత్ర పోషిస్తున్నాను.. అది ఎలాంటి పాత్ర అనేది జనం నిర్ణయిస్తారు’ అని చెప్పగా.. అందుకు విలేకరి మళ్ళీ ‘మీ డ్రెస్ కూడా నక్సలైట్’ పాత్ర అని చెబుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అందుకు హరికృష్ణ ‘ ‘బొబ్బిలి పులి’ లో నాన్నగారు(సీనియర్ ఎన్టీఆర్) కూడా ఇలాంటి డ్రెస్ వేసుకుని కనిపించలేదా?’ అంటూ మరో కౌంటర్ విసిరారు హరికృష్ణ.

 

ఇది ‘శ్రీరాములయ్య’ సినిమా షూటింగ్ కు సంబంధించిన ప్రెస్ మీట్ వీడియో అని తెలుస్తుంది. మోహన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో హరికృష్ణ కీలక పాత్ర పోషించారు. ఎన్.శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ వీడియోని గమనిస్తే.. హరికృష్ణ ఇప్పుడు జూ.ఎన్టీఆర్ ఎలా ఉన్నాడో… అలానే కనిపిస్తున్నారు అని చెప్పాలి. ఎన్టీఆర్ కూడా మీడియాతో ముచ్చటించే విధానం ఇలా సరదా సరదాగా ఉంటుంది. మీరు కూడా హరికృష్ణ ఓల్డ్ వీడియోను ఓ లుక్కేయండి :

 

 

క్రిష్, జ్యోతి కృష్ణతో పాటు అతను కూడా డైరెక్షన్ చేశాడట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus