Jr NTR: ఆ సినిమా విషయంలో తారక్ ఇప్పటికీ ఫీలవుతూనే ఉన్నారా?

సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత కొంతమంది హీరోలు కొన్ని కారణాల వల్ల కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వస్తుంది. ఇలా వదులుకున్న సినిమాలు కనుక మంచి విజయం సాధిస్తే కొన్ని సందర్భాలలో ఎందుకు ఈ సినిమా వదులుకొని తప్పు చేసాము అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు. స్టార్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ ఉన్నారు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

ఇలా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఎన్టీఆర్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ కొన్ని కారణాలవల్ల ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే బోయపాటి శ్రీను దర్శకుడిగా పరిచయమైనటువంటి భద్ర సినిమా కథ ముందుగా ఎన్టీఆర్ కు వినిపించారట. మొత్తం విన్నటువంటి (Jr NTR) ఎన్టీఆర్ కి కొన్ని సందేహాలు కలిగాయని తెలుస్తుంది.

బోయపాటి ఇండస్ట్రీకి కొత్త అదేవిధంగా ఈయన కథ చెప్పే విషయంలోనే కొన్ని ఇబ్బందులు పడటంతో ఈ సినిమాపై ఎన్టీఆర్ కి కొన్ని సందేహాలు వచ్చాయట దీంతో ఈ సినిమా చేయటానికి ఈయన ఇష్టపడలేదు ఇలా ఎన్టీఆర్ కి ఈ సినిమా కథ చెప్పినప్పటికీ ఎన్టీఆర్ ఈ సినిమాని రిజెక్ట్ చేశారట. దీంతో చేసేదేమీ లేక బోయపాటి ఈ సినిమా కథతో రవితేజ వద్దకు వెళ్ళగా ఆయన ఈ సినిమాకి ఓకే చెప్పారు.

ఈ విధంగా రవితేజ మీరాజాస్మిన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలనాలను సృష్టించింది. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాని వదులుకొని నేను తప్పు చేశాను అని ఇప్పటికీ బాధపడుతూ ఉంటానని గత ఇంటర్వ్యూలలో ఈయన వెల్లడించారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ ఒక బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకున్నారని చెప్పాలి అయితే ఈయన కెరియర్ లో ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus