Jr NTR: ఆ హీరోయిన్లపై ఆసక్తి చూపిస్తున్న తారక్!

టాలీవుడ్ లో వేగంగా సినిమాల్లో నటించే హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. గత కొన్నేళ్ల నుంచి వరుసగా ఎన్టీఆర్ విజయాలను సొంతం చేసుకుంటుండగా తారక్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. మరోవైపు తారక్ కొరటాల శివ కాంబో మూవీ రెగులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి జరగనుండగా కేవలం ఆరు నెలల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ ఎంపికయ్యారని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. మరోవైపు తారక్ బుచ్చిబాబు కాంబో మూవీకి జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికయ్యారని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాలలో హీరోయిన్లుగా వరుసగా బాలీవుడ్ హీరోయిన్లకు ఓటేస్తుండటం గమనార్హం. కొంతమంది నెటిజన్లు ఈ విషయం తెలిసి తారక్ కు టాలీవుడ్ హీరోయిన్లు నచ్చడం లేదా? అని కామెంట్లు చేస్తున్నారు. అయితే బాలీవుడ్ హీరోయిన్లు నటించడం ద్వారా సినిమాలకు ఊహించని స్థాయిలో బిజినెస్ జరగడంతో పాటు సినిమాలకు కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు.

మరోవైపు దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు నచ్చే కథలను ఎన్టీఆర్ ఎంపిక చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఎన్టీఆర్ కొత్త కథలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్టులకు సంబంధించి త్వరలో ప్రకటనలు వెలువడే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ సినిమాల లైనప్ విషయంలో అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఆర్ఆర్ఆర్ హిట్టైతే తారక్ రెమ్యునరేషన్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఆర్ఆర్ఆర్ ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఆర్ఆర్ఆర్ విడుదల తర్వాత బాలీవుడ్ లో తారక్ పేరు మారుమ్రోగుతుందని తారక్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus