టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్ అనే విషయం తెలిసిందే. ఏ పాత్రలో నటించినా మరెవరూ తనకంటే బాగా నటించలేరు అనేంత అద్భుతంగా నటించగల ప్రతిభ జూనియర్ ఎన్టీఆర్ సొంతం కావడం గమనార్హం. తెలుగు, ఇంగ్లీష్ తో పాటు ఇతర భాషల్లో కూడా తారక్ అనర్గళంగా మాట్లాడలరు. మలయాళం మినహా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇతర భాషల్లో తారక్ డబ్బింగ్ చెప్పారు. తాజాగా ది కపిల్ శర్మ షోలో పాల్గొన్న తారక్ సులభంగా ఆర్ఆర్ఆర్ కు హిందీలో డబ్బింగ్ ఏ విధంగా చెప్పారనే ప్రశ్న ఎదురైంది.
హిందీ ఎక్కువగా మాట్లాడే నగరాలలో హైదరాబాద్ ఒకటని తారక్ అన్నారు. ఎందుకంటే ఈ భాషను నేర్చుకోవాలని అమ్మ కోరుకుందని తారక్ చెప్పుకొచ్చారు. హిందీ జాతీయ భాష అని ఆ భాష ఇప్పుడు సహాయపడిందని తారక్ వెల్లడించారు. ముంబై నుంచి కొంతమంది టెక్నీషియన్స్ ఫ్రెండ్స్ కూడా వస్తూనే ఉంటారని తారక్ చెప్పుకొచ్చారు. మాట్లాడటం ద్వారా నెమ్మదినెమ్మదిగా భాషను నేర్చుకోవడం సులువు అవుతుందని తారక్ కామెంట్లు చేశారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ జనవరి నెల 2వ తేదీన సొనీ ఎంటర్టైన్మెంట్ లో ప్రసారం కానుందని బోగట్టా.
వరుస ప్రమోషన్లతో ఆర్ఆర్ఆర్ టీం సినిమాలపై అంచనాలను పెంచింది. మరోవైపు ఏపీలో సీజ్ చేసిన థియేటర్లకు ప్రభుత్వం వెసులుబాటును కల్పించడం గమనార్హం. థియేటర్ల యజమానులు అధికారులు గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవాలని పేర్ని నాని సూచనలు చేశారు. అన్ని వసతులు కల్పించి నెల రోజులలో జేసీలకు దరఖాస్తు చేసుకోవాలని పేర్ని నాని థియేటర్ల యజమానులకు చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
ఈ సినిమా పబ్లిసిటీ కోసమే మేకర్స్ 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!