బాలయ్య, ఎన్టీఆర్ ల గురించి మనకు తెలియని విషయం..!

ఈ మధ్య కొన్ని హిట్ సినిమాలు.. మరియు ప్లాప్ సినిమాల గురించి తన అభిప్రాయాన్ని చెబుతూ వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు పరుచూరి గోపాలకృష్ణ. తాజాగా ఈయన ఎన్టీఆర్, బాలయ్య ల మధ్య జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటన గురించి చెప్పుకుంటూ వచ్చారు. పరిచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ…” ‘అల్లరి రాముడు’ షూటింగ్ పాలకొల్లులో జరుగుతున్న రోజులవి. మేము కూడా షూటింగ్ లొకేషన్ లో ఉన్నాం.అప్పటికే ‘ఆది’ విడుదలయ్యి ఘన విజయం సాధించింది. ఇక ‘అల్లరి రాముడు’ షూటింగ్ గ్యాప్ లో మేము చిన రామయ్య(ఎన్టీఆర్) తో మాట్లాడుతూ… ‘ మీ ఫ్యామిలీ లో అందరితోనూ మాట్లాడతావా’ అని అడిగాము. ఆ మాట అనగానే ఎన్టీఆర్ కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి. అలా ఏడుస్తూనే…’లేదండీ.. అందరి ఆభిమానుల్లాగే నేను కూడా అంతే..! మా బాబాయ్ అంటే ప్రాణం’ అంటూ చెప్పాడు. మేము మీ బాబాయ్ కు ఫోన్ కలిపి ఇస్తాము మాట్లాడు’ అని ఎన్టీఆర్ తో చెప్పాము. అప్పుడు ఎన్టీఆర్ ఇంకా ఎక్కువగా ఏడవడం మొదలుపెట్టాడు.

బాలయ్య కు ఫోన్ చేసి ఎన్టీఆర్ తో మాట్లాడండి అని చెప్పాము. దానికి బాలయ్య ఇవ్వండి అన్నారు. ఇచ్చాం..! ఎన్టీఆర్ మాట్లాడకుండా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాడు. వెంటనే.. బాలయ్య వాడు ఎందుకు అలా ఏడుస్తున్నాడు అని బాలయ్య అడిగారు. మీరయినా చెప్పండి వాడికి అన్నారు.ఎన్టీఆర్… బాలయ్య తో మాట్లాడడం అదే మొదటిసారి. ఇక ‘అల్లరి రాముడు’ రిలీజ్ అయ్యాక ఓ సక్సెస్ మీట్ జరిగింది. దానికి బాలయ్య ముఖ్య అతిధి గా విచ్చేశారు. అప్పుడు ఆయనకి దండ వేయమని ఎన్టీఆర్ కు చెప్పింది మేమే..! అప్పుడు కూడా ఎన్టీఆర్ ఏడుస్తూనే ఉన్నాడు. ఈ విషయం అభిమానులకి తెలియాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు చెబుతున్నాను. వారి బాండింగ్ అలాంటిది.” అంటూ పరిచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus