Jr NTR: ఎన్టీఆర్ ను కలిసి ఇన్విటేషన్ ఇచ్చిన దిల్ రాజు.. ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా బృందావనం, రామయ్యా వస్తావయ్యా సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలలో బృందావనం హిట్ గా నిలిస్తే రామయ్యా వస్తావయ్యా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ తో మరో సినిమాను నిర్మించాలని దిల్ రాజు భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలకు దిల్ రాజు నైజాం డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. అయితే తాజాగా దిల్ రాజు, శిరీష్ తమ ఇంట మరికొన్ని రోజుల్లో జరగనున్న శుభకార్యానికి జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించడం జరిగింది.

శిరీష్ కొడుకు ఆశిష్ పెళ్లిపత్రికను దిల్ రాజు, ఆయన కుటుంబ సభ్యులు తారక్ ను (Jr NTR) వ్యక్తిగతంగా కలిసి అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఈ ఫోటోలలో తారక్ తన రెగ్యులర్ లుక్ లోనే కనిపించడం గమనార్హం. ఫిబ్రవరి నెల 14వ తేదీన జైపూర్ లో ఆశిష్ వివాహ వేడుక గ్రాండ్ గా జరగనుండగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారని తెలుస్తోంది.

ఆశిష్ పెళ్లి చేసుకోబోయే యువతి పేరు అద్వైత రెడ్డి అని ఆమె ప్రముఖ బిజినెస్ మేన్ కూతురు అని సమాచారం అందుతోంది. తారక్ ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు దేవర మూవీ చివరి షెడ్యూల్ త్వరలో మొదలుకానుందని చివరి షెడ్యూల్ లో సాంగ్స్ తో పాటు యాక్షన్ షాట్స్ షూట్ చేయనున్నారని సమాచారం అందుతోంది.

దేవర మూవీ వాయిదా గురించి మేకర్స్ నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా వాయిదా పడితే అదే సమయానికి ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఏప్రిల్ 5వ తేదీ తర్వాత వరుస సెలవులు ఉండటంతో ఆ తేదీన సినిమాలను రిలీజ్ చేయడానికి గట్టి పోటీ ఉంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus