Jr NTR: తారక్.. మళ్ళీ బాలీవుడ్ లోనే బిజీబిజీగా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్  (Jr NTR)  బాలీవుడ్ ఎంట్రీలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ప్రస్తుతం హృతిక్ రోషన్ (Hrithik Roshan తో కలిసి నటిస్తున్న ‘వార్ 2’ మూవీ కోసం వర్క్ చేస్తున్న తారక్, బీటౌన్ లో తన మార్క్ చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఎన్టీఆర్‌కు వస్తున్న క్రేజ్ చూస్తే బాలీవుడ్ కూడా మరో భారీ స్టార్ హీరోని సొంతం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ‘వార్ 2’ సినిమా గురించి ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఐకానిక్ స్పై యాక్షన్ ఫ్రాంచైజీ కింద తెరకెక్కుతున్న ఈ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 2025 ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Jr NTR

ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు నెగెటివ్ టచ్ ఉన్నప్పటికీ, ఆ క్యారెక్టర్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా డిజైన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే లీక్ అయిన ఎన్టీఆర్ లుక్స్ ఆయన పాత్రపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇక బాలీవుడ్ లో వరుసగా ప్రాజెక్టులు చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ‘వార్ 2’ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఎన్టీఆర్‌ తో మరో ప్రాజెక్ట్ చేయడానికి చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా దర్శకుడిగా మళ్లీ అయాన్ ముఖర్జీ ఉండబోతున్నట్లు టాక్. అయితే ఇదే నిజమైతే, ఎన్టీఆర్ బాలీవుడ్ లో తన రెండో సినిమాకి కూడా ఓ బిగ్ టికెట్ మూవీతోనే రంగప్రవేశం చేస్తాడు. ‘వార్ 2’ అనంతరం బాలీవుడ్ లో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. హృతిక్ తో స్క్రీన్ షేర్ చేస్తూ, తన యాక్షన్ స్కిల్స్ తో పాటు పెర్ఫార్మెన్స్ ని కూడా ప్రూవ్ చేసే ప్రయత్నంలో తారక్ ఉన్నాడు.

ఈ సినిమా విజయవంతమైతే, బాలీవుడ్ లో ఎన్టీఆర్ కెరీర్ కొత్త దశలోకి వెళ్ళనుందనడంలో సందేహం లేదు. మరోవైపు, టాలీవుడ్ లోనూ ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభించబోతున్నాడు. బాలీవుడ్ లోనూ మరిన్ని అగ్ర దర్శకులతో సినిమాలు చేయడానికి తారక్ ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తోంది. ఇది నిజమైతే, ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా ఎదిగే అవకాశాలు మరింత వేగంగా సాకారం కానున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus