Jr NTR: అక్కడ కూడా చెమటలు చిందిస్తున్న దేవర.. ఏం జరిగిందంటే

  • May 30, 2023 / 12:13 AM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఅర్ గురించి కొంతమంది కావాలనే విమర్శలు చేసినా ఆయన గురించి తెలిసిన వాళ్లు మాత్రం తప్పుగా ఎప్పుడూ కామెంట్ చేయరనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించాలని హైదరాబాద్ కు వచ్చిన తారక్ మళ్లీ వెకేషన్ కు వెళ్లారు. అయితే ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న తారక్ ఈ సినిమాకు సంబంధించి తన లుక్ లో ఏ మాత్రం మార్పు ఉండకూడదని భావించి విదేశాల్లో కూడా చెమటలు చిందిస్తున్నారు.

వెకేషన్స్ కు వెళ్లినా తగ్గేదేలే అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కష్టపడుతున్న తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంత డెడికేషన్ ఉంది కాబట్టే తారక్ నంబర్ వన్ హీరో అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నారు. తారక్ టీం ఎన్టీఆర్ వ్యాయామం చేస్తున్న ఫోటోను షేర్ చేసింది.

ఈ సినిమాలో తారక్ లుక్ కొత్తగా ఉండటంతో పాటు ఈ సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయని ఇప్పటికే విడుదలైన పోస్టర్ల ద్వారా స్పష్టత వచ్చేసింది. యంగ్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. తారక్ ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాల బడ్జెట్ ఏకంగా 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అని సమాచారం అందుతోంది.

తారక్ (Jr NTR) రాజమౌళి కాంబోలో రాబోయే రోజుల్లో మరో క్రేజీ ప్రాజెక్ట్ రానుందని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. వెకేషన్ ను త్వరగా ముగించుకుని దేవర రెగ్యులర్ షూట్ తో తారక్ బిజీ కానున్నారని బోగట్టా. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీ ఈ సినిమా విడుదల కానుండగా ఆరోజు తారక్ ఫ్యాన్స్ కు స్పెషల్ డేగా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus